Home » Madhavaram Krishna Rao
కాంగ్రెస్ నేతల వేధింపుల వల్లే బీఆర్‌ఎస్ నాయకుడి మృతిచెందాడని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆయన మాట్లాడుతూ.. బోరబండలో ఇళ్లు కట్టుకుంటున్న పేద కుటుంబానికి చెందిన వారిపై కాంగ్రెస్ నాయకులు అరాచకాలకు పాల్పడుతున్నారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన లేకుండా పోయిందని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విమర్శించారు. ఎన్నికలప్పుడు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ హామీని విస్మరించిందన్నారు.
రాసిపెట్టుకోండి.. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ప్రభంజనం ఖాయం అని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఎక్కతుర్తిలో నిర్వహించిన సభ సూపర్ సక్సెస్ అన్నారు. సభ విజయవంతంతో కాంగ్రెస్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని ఆ పార్టీకి చెందిన కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో అస్తవ్యస్థ పాలన కొనసాగిస్తోందన్నారు.
బీఆర్ఎస్ నేతలు ఘాటు వార్నింగ్ ఇచ్చారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఉరుకోబోమని కూకట్‌పల్లి బీఆర్ఎస్ ఎస్సీసెల్ అధ్యక్షుడు బొట్టు విష్ణు, బాలానగర్ అధ్యక్షుడు దర్శనం శాకయ్య హెచ్చరించారు.
BRS MLC land dispute: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ నవీన్‌రావుకు చెందిన భూమిలో ప్రైవేటు వ్యక్తులు హల్‌చల్ చేశారు. కంచె వేసేందుకు ప్రయత్నించడంతో కొద్దిపాటి ఘర్షణ చోటు చేసుకుంది.
మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నదని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(Kukatpally MLA Madhavaram Krishna Rao) కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు.
ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘లక్ష డప్పులు-వేయి గొంతులు’కు దండోరా సాంస్కృతిక మహా ప్రదర్శనకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(Kukatpally MLA Madhavaram Krishna Rao) తెలిపారు.
KPHB Lands: భూముల వేలాన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చిన స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హౌసింగ్ స్థలాల వేలంలో భాగంగా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్యే నివాసం వద్ద పోలీసులు మోహరించారు. పోలీసుల తీరుపై ఎమ్మెల్యే అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్లాట్ల వేలం పేరుతో ప్రజలను మోసం చేయొద్దని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హౌసింగ్‌బోర్డు అధికారులకు సూచించారు. హౌసింగ్ బోర్డు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, మున్సిపల్ చట్టాలు, మాస్టర్ ప్లాన్‌ను పరిగణలోకి తీసుకోకుండా ప్లాట్లను అమ్ముకుని సొమ్ముచేసుకోవడమే ధ్యేయంగా పనిచేయడం సిగ్టుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.