Share News

MLA: ఎమ్మెల్యే ‘మాధవరం’ అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

ABN , Publish Date - Feb 25 , 2025 | 11:07 AM

మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నదని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(Kukatpally MLA Madhavaram Krishna Rao) కాంగ్రెస్‌ పార్టీపై విరుచుకుపడ్డారు.

MLA: ఎమ్మెల్యే ‘మాధవరం’ అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

- మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌

- కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

హైదరాబాద్: మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నదని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(Kukatpally MLA Madhavaram Krishna Rao) కాంగ్రెస్‌ పార్టీపై విరుచుకుపడ్డారు. మేడ్చల్‌-మల్కాజిగిరి బీఆర్‌ఎస్‌ కంటెస్టెడ్‌ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి కూకట్‌పల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్లు, ఏ ప్రతిపాదికన ఇస్తారో వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ఈ వార్తను కూడా చదవండి: Special trains: బీదర్‌ -నిజాముద్దీన్‌ మధ్య రెండు ప్రత్యేక రైళ్లు..


విధివిధానాలు ప్రకటించకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవవర్గంలోని 9 డివిజన్‌లకు ప్రభుత్వం14 నెలల్లో కేవలం రూ.6 కోట్లు కేటాయించారని, బీఆర్‌ఎస్‌ హయాంలో నెలకు సుమారు రూ.30 కోట్లు ఖర్చుచేశామని గుర్తుచేశారు. గత ప్రభుత్వంలో నిర్మించిన బ్రిడ్జిలకు రంగులు వేసి వాటిని తామే నిర్మించామని గొప్పలు చెప్పుకోవటం సిగ్గుచేటని విమర్శించారు.


పోచమ్మ ఆలయంలో పూజలు

కూకట్‌పల్లి పోచమ్మతల్లి దేవాలయ 2వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ఎమ్మెల్యే మాధవరం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయకమిటీసభ్యులు ఆయనకు శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో కూకట్‌పల్లి కార్పొరేటర్‌ జూపల్లి సత్యనారాయణరావు, మాజీ కార్పొరేటర్‌ రంగారావు, చిన్న తులసి, సూర్యారావు, వెంగళరావు, ఆలయకమిటీ సభ్యులు పాల్గొన్నారు.


కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎస్‌లోకి చేరికలు

కూకట్‌పల్లి బాలానగర్‌ డివిజన్‌ గిరిసాగర్‌రాజు ఆధ్వర్యంలో కూకట్‌పల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమక్షంలో బాలానగర్‌ కాంగ్రెస్‌ నాయకులు గులాబీ కండువా కప్పుకుని బీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ కో-ఆర్డినేటర్‌ సతీష్‌ అరోరా, విష్ణు, బాలానగర్‌కు మధు పాల్గొన్నారు.


మృతుడి కుటుంబ సభ్యులకు పరామర్శ

ఎమ్మెల్యే మాధవరం అభిమాని చిన్నపూమాల అబ్బాయి ఇటీవలే ప్రమాదవశాత్తు మృతిచెందడంతో ఎమ్మెల్యే వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. చిన్న వయసులోనే ఇలా జరగడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.


ఈవార్తను కూడా చదవండి: ఏఆర్‌ డెయిరీ ఎండీకి చుక్కెదురు

ఈవార్తను కూడా చదవండి: మేళ్లచెర్వులో మొదలైన జాతర సందడి

ఈవార్తను కూడా చదవండి: Kishan Reddy: బీఆర్‌ఎస్‌తో రేవంత్‌ కుమ్మక్కు

ఈవార్తను కూడా చదవండి: బాసరలో కిటకిటలాడుతున్న క్యూ లైన్లు, అక్షరాభ్యాస మండపాలు

Read Latest Telangana News and National News

Updated Date - Feb 25 , 2025 | 11:08 AM