Share News

Lands Auction: కేపీహెచ్‌బీ భూముల వేలం.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హౌజ్ అరెస్ట్

ABN , Publish Date - Jan 24 , 2025 | 11:58 AM

KPHB Lands: భూముల వేలాన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చిన స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హౌసింగ్ స్థలాల వేలంలో భాగంగా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్యే నివాసం వద్ద పోలీసులు మోహరించారు. పోలీసుల తీరుపై ఎమ్మెల్యే అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Lands Auction: కేపీహెచ్‌బీ భూముల వేలం.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హౌజ్ అరెస్ట్
BRS MLA Madhavaram Krishna Rao

హైదరాబాద్, జనవరి 24: కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ భూముల వేలం (KPHB Land Auction) వివాదాస్పదంగా మారింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య కేపీహెచ్‌బీ భూమలు వేలం కొనసాగుతోంది. రోడ్డు విస్తరణలో కోల్పోయే ప్లాట్లను ప్రజలకు అమ్మి మోసం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాస్టర్ ప్లాన్లు పరిగణలోకి తీసుకోకుండా ఫ్లాట్లను అమ్మడంతో ప్రజలు నష్టపోతారంటూ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో భూముల వేలాన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చిన స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును (BRS MLA Madhavaram Krishna Rao) పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హౌసింగ్ స్థలాల వేలంలో భాగంగా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు.


ఎమ్మెల్యే నివాసం వద్ద పోలీసులు మోహరించారు. పోలీసుల తీరుపై ఎమ్మెల్యే అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హౌసింగ్‌ బోర్డు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, మున్సిపల్‌ చట్టాలు, మాస్టర్‌ ప్లాన్‌ను పరిగణలోకి తీసుకోకుండా ప్లాట్లను అమ్ముకుని సొమ్ముచేసుకోవడమే ధ్యేయంగా పెట్టుకున్నారని.. భూముల వేలాన్ని అడ్డుకుని తీరుతామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పష్టం చేశారు. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డులో మొత్తం 28 ఫ్లాట్లను హౌసింగ్ బోర్డ్ అధికారులు వేలం వేస్తున్నారు. హైకోర్టు స్టే తో 9వ ఫేజ్ మినహాయించి.. మిగిలిన ప్లాట్ల వేలం వేస్తున్నారు అధికారులు.

kphb-brs-mla.jpg

Supreme Court: వైసీపీ నేత గౌతంరెడ్డికి సుప్రీంలో ఊరట


మరోవైపు కేపీహెచ్‌బీ భూముల వేలంలో హైటెన్షన్ నెలకొంది. అడుగడుగునా భారీగా పోలీసుల మోహరించారు. భారీ పోలీసుల బందోబస్తు నడుమ భూముల వేలం కొనసాగుతోంది. కాగా.. కేపీహెచ్‌బీలో భూముల వేలాన్ని జనసేన నేతలు కూడా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వేలం ప్రాంగణానికి వచ్చిన జనసేన నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులకు, జనసేన నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నేతల ఆందోళన నేపథ్యంలో హౌసింగ్ భూముల వేలం వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది.


కాగా.. కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు కాలనీ పరిధిలో మిగిలిన ప్లాట్లను వేలం వేయనున్నట్లు గృహ నిర్మాణ శాఖ కమిషనర్‌, బోర్డు వైస్‌ చైర్మన్‌ వి.పి.గౌతమ్‌ ఓ ప్రకటనలో తెలియజేశారు. గృహ నిర్మాణ పథకాల అమలుకు వీలు కాని చిన్నచిన్న విస్తీర్ణం కలిగిన ప్లాట్లను, గృహాల మధ్య అక్కడక్కడ మిగిలిపోయిన ప్లాట్లనే వేలం వేస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే హౌసింగ్‌ బోర్డు పరిధిలో ఉన్న 700 ఎకరాల భూములు అన్యాక్రాంతం కాకుండా తగిన చర్యలు తీసుకున్నామని గౌతమ్‌ ఈ సందర్భంగా వెల్లడించారు.


ఇవి కూడా చదవండి..

నాలా ద్వారా ఇంట్లోకి దూసుకొస్తున్న కొండచిలువ..

CM Revanth Reddy: దావోస్ టూర్ సక్సెస్.. స్వరాష్ట్రానికి సీఎం రేవంత్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 24 , 2025 | 11:58 AM