MLA: హెచ్‌సీయూ విద్యార్థులకు అండగా బీఆర్‌ఎస్
ABN , Publish Date - Apr 03 , 2025 | 10:55 AM
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని ఆ పార్టీకి చెందిన కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో అస్తవ్యస్థ పాలన కొనసాగిస్తోందన్నారు.

- కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
హైదరాబాద్: హెచ్‌సీయూ (హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ)కి చెందిన భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రతీ పౌరుడిపై ఉందని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(Kukatpally MLA Madhavaram Krishna Rao) అన్నారు. బుధవారం కూకట్‌పల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, హైదరాబాద్‌లో రోజురోజుకు కాలుష్యం పెరుగుతుందని ఒకవైపు కేంద్రం హెచ్చరిస్తున్నా, వాటిని కాంగ్రెస్ పాలకులు పెడచెవిన పెట్టి భూముల అమ్మకాలు చేపడుతున్నారని కాంగ్రెస్(Congress) ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ఈ వార్తను కూడా చదవండి: BJP: ఉచిత బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే..
చుట్టుపక్కల ఇప్పటికే కాంక్రీట్ జంగల్‌గా మారిందని అక్కడి ప్రజలు స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవాలంటే హెచ్‌సీయూ(HCU) భూముల్లో ఉన్న చెట్లను కాపాడుకోవాలన్నారు. భవిష్యత్ తరాలకు పర్యావరణ, భూగర్భజలాల ఇబ్బందులు రావద్దనే మాజీ ముఖ్యమంత్రి హరితహారంతో హైదరాబాద్‌లో కోట్లాది మొక్కలు నాటించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గడచిన 15 నెలలోనే లక్షాయాభైౖవేల కోట్లకు పైగా అప్పులు చేసి ప్రజలకు ఇచ్చిందేమి లేదన్నారు. హెచ్‌సీయూలో విద్యార్థులపై పోలీసుల దాడి అమానుషమని, విద్యార్థులకు బీఆర్‌ఎ్‌సపార్టీ పూర్తిగా అండగా ఉంటుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి:
కొత్త తల్లులు గిల్ట్ లేకుండా..
ఖమ్మం జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం..
Read Latest Telangana News and National News