Hyderabad: ఎమ్మెల్యేపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఖబడ్దార్..
ABN , Publish Date - Mar 20 , 2025 | 11:35 AM
బీఆర్ఎస్ నేతలు ఘాటు వార్నింగ్ ఇచ్చారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఉరుకోబోమని కూకట్‌పల్లి బీఆర్ఎస్ ఎస్సీసెల్ అధ్యక్షుడు బొట్టు విష్ణు, బాలానగర్ అధ్యక్షుడు దర్శనం శాకయ్య హెచ్చరించారు.

- కూకట్‌పల్లి బీఆర్ఎస్ ఎస్సీసెల్ అధ్యక్షుడు విష్ణు
హైదరాబాద్: కూకట్‌పల్లి నియోజకవర్గంతో ఏమాత్రం సంబంధంలోని వారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram Krishna Rao)పై తప్పుడు ఆరోపణలు చేస్తే ఉరుకోబోమని కూకట్‌పల్లి బీఆర్ఎస్ ఎస్సీసెల్ అధ్యక్షుడు బొట్టు విష్ణు, బాలానగర్ అధ్యక్షుడు దర్శనం శాకయ్య హెచ్చరించారు. కూకట్‌పల్లిలో బుధవారం వారు విలేకరులతో మాట్లాడుతూ... మాదిరెడ్డి యుగంధర్‌రెడ్డి సోషల్ మీడియా(Social Media)లో తనకు ఇష్టం వచ్చినట్లుగా ఎమ్మెల్యేపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాడన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Etela Rajender: రేవంత్ ప్రతీ నిర్ణయం బూమరాంగే
నియోజవర్గ ప్రజలు తమ ఓటుతోనే సమాధానం ఇచ్చారని గుర్తుంచుకోవాలన్నారు. ఉమ్మడి ఖైరతాబాద్ నుంచి కూకట్‌పల్లి, శెర్‌లింగంపల్లి ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్న ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తే తగిన గుణపాఠం చెబుతామన్నారు. కాంగ్రెస్‌పార్టీ నాయకులు చేస్తున్న వసూళ్లు, అరాచకాలను త్వరలోనే బయట పెడతామన్నారు. సమావేశంలో ఎస్సీసెల్ నాయకులు రత్నం, ప్రభాకర్, కృష్ణ, వెంకటేశ్, మధు, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
మంత్రి సీతక్క ఎమ్మెల్యే స్టిక్కర్ దుర్వినియోగం కేసులో మరోట్విస్ట్..
కేసీఆర్ క్యాంపు కార్యాలయానికి టులెట్ బోర్డు..
Kamareddy Car Accident: పెట్రోలింగ్ చేస్తూ ఆగిన కానిస్టేబుళ్లు.. ఇంతలోనే