MLA: ఎస్సీ వర్గీకరణకు మద్దతిస్తాం..
ABN , Publish Date - Feb 06 , 2025 | 08:14 AM
ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘లక్ష డప్పులు-వేయి గొంతులు’కు దండోరా సాంస్కృతిక మహా ప్రదర్శనకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(Kukatpally MLA Madhavaram Krishna Rao) తెలిపారు.

- ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
- వర్గీకరణకు గత ప్రభుత్వంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారని వెల్లడి
హైదరాబాద్: ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘లక్ష డప్పులు-వేయి గొంతులు’కు దండోరా సాంస్కృతిక మహా ప్రదర్శనకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(Kukatpally MLA Madhavaram Krishna Rao) తెలిపారు. బుధవారం వైజంక్షన్ వద్ద కూకట్‌పల్లి ఎమ్మార్‌పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దండోరా కార్యక్రమంలో పాల్గొని డప్పు కొడుతూ అందరిలో ఉత్సాహాన్ని నింపారు. మొదట కూకట్‌పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణతో కలిసి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు యువకుల ఆత్మహత్య
అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఎస్సీ వర్గీకరణ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేశారని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణను ఆమోదించాలని కేసీఆర్ కేంద్రానికి వినతి పత్రాన్ని అందజేశారని, వర్గీకరణపై కేంద్రం ఆమోదించి ఏడాది గడిచినా రేవంత్ సర్కార్ వర్గీకరణ బిల్లును అమలు చేయలేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. మందకృష్ణ మాదిగ(Mandakrishna Madiga) నిర్వహించబోయే లక్ష డప్పులు-వేయి గొంతులు దండోరా సాంస్కృతిక మహా ప్రదర్శనకు ప్రభుత్వం అడ్డుకోకుండా అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన యుగంధర్‌రెడ్డి
శాసనసభ, శాసనమండలిలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం తెలపడంపై కూకట్‌పల్లి కాంగ్రెస్ ఏ బ్లాక్ ఉపాధ్యక్షుడు మాదిరెడ్డి యుగంధర్‌రెడ్డి తన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాలానగర్‌లో అంబేడ్కర్ చిత్రపటాన్ని ఏర్పాటుచేసి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. యుగంధర్‌రెడ్డి మాట్లాడుతూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఎస్సీ వర్గీకరణ బిల్లును అమోదింపచేసి మాదిగల పట్ల ప్రేమను సీఎం చాటారన్నారు. ఏ ముఖ్యమంత్రి చేయని సాహసాన్ని చేసి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి, ఆమోదింప చేసి మాదిగ సోదరులకు దేవుడయ్యారని మాదిగ సోదరుల తరపున సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.
అంబేడ్కర్‌ను ఆదర్శంగా తీసుకుని మాదిగలకు న్యాయం చేస్తూ వారిని అక్కున చేర్చేకున్న సీఎం చరిత్ర పుటల్లో నిలిచిపోతారన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ కలలుగన్న సామాజిక న్యాయం కేవలం కాంగ్రెస్ పార్టీతో, సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోనే సాధ్యపడిందని తన మనోభావాన్ని వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణకు కృషి చేసిన మందకృష్ణ మాదిగకు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. ఎస్సీ వర్గీకరణతో రానున్న రోజుల్లో మాదిగలకు మంచి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఈవార్తను కూడా చదవండి: KTR: అది అసమగ్ర కులగణన
ఈవార్తను కూడా చదవండి: GHMC: ప్యారానగర్ డంపుయార్డ్ పనులు ప్రారంభం
ఈవార్తను కూడా చదవండి: Mastan Sai: మస్తాన్‌కు డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్!
ఈవార్తను కూడా చదవండి: అర్వింద్ మాటలు కాదు.. చేతల్లో చూపించాలి..: కవిత
Read Latest Telangana News and National News