Home » Maharashtra
మహారాష్ట్రలోని అధికార మహయుతి ప్రభుత్వంపై విపక్ష మహా వికాస్ అఘాడి ఆదివారంనాడు విమర్శలు గుప్పించింది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి, అవినీతి, ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై ఆక్షేపణ తెలిపింది.
ఎన్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిఖి హత్య మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన కొద్ది గంటలకే ఆయనను తామే హత్య చేసినట్టు లారెన్స్ బిష్ణోయ్ గ్రూప్ ప్రకటించింది. దీంతో బాబా సిద్ధిఖి హత్యకు బాలీవుడ్‌తో ఆయనకు సత్సంబంధాలు ఉండటం ఒక కారణం కావచ్చా అనే కొత్త కోణం కూడా వెలుగుచూసింది.
ఎన్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ(Baba Siddique) హత్య దేశవ్యా్ప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే సిద్ధిఖీని తామే హత్య చేసినట్లు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. ఈ కేసులో ప్రస్తుతం ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోగా మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.
ముంబై: ఎన్సీపీ (NCP) నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిఖి (Baba Siddique) హత్య పక్కా ప్లానింగ్‌తోనే జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కాంట్రాక్ట్ హత్య కావచ్చునా, వ్యాపారంలో శత్రుత్వమే కారణమా, స్లమ్ రిహాబిలిటేషన్ ప్రాజెక్టు కారణంగానే ఆయనను హంతకులు మట్టుబెట్టారా అనే పలు కోణాల నుంచి ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
ఎన్సీపీ నేత, మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్యపై లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఆదివారం తన ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ హత్య ఘటనతో మహారాష్ట్రలో శాంతి భద్రతలు పూర్తిగా కుప్పకూలాయనే విషయం తేటతెల్లమవుతుందన్నారు. ఈ హత్య ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
ముంబైలో ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం సీనియర్ నేత, కాంగ్రెస్ మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ నిన్న రాత్రి హత్యకు గురయ్యారు. ముసుగులు ధరించిన ముగ్గురు దుండగులు బాబా సిద్ధిఖీని కాల్చి చంపారు. క్రైమ్ బ్రాంచ్ ఈ కేసును దర్యాప్తు చేస్తుంది.
చాలాకాలంగా తాను సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నానని, ఆ కారణంగానే ఈ సిస్టమ్ (రాజకీయాలు)లోకి వచ్చానని షాయాజీ షిండే చెప్పారు. తన సామాజిక సేవ కొనసాగుతుందని తెలిపారు.
మహారాష్ట్రలోని నాసిక్‌లో విషాదం చోటుచేసుకుంది. ఫైరింగ్ ప్రాక్టీసులో ఇండియన్ ఫీల్డ్ గన్ నుంచి షెల్ మిస్‌ఫైర్ కావడంతో ఇద్దరు ఇండియన్ ఆర్మీ అగ్నివీరులు మరణించారు.
దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాల వేళ వరణుడు పలుచోట్ల ఆటంకం కలిగించాడు. అంతేకాదు వచ్చే రెండు, మూడు రోజులు కూడా వర్షాలు ఉన్నాయని వెదర్ రిపోర్ట్ అంచనా వేసింది. అయితే ఏ ప్రాంతాల్లో ఉన్నాయనేది ఇక్కడ తెలుసుకుందాం.
మహారాష్ట్ర ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారతదేశాన్ని కాంగ్రెస్ పార్టీ కుల, మత ప్రాతిపదికన విభజించేందుకు ప్రయత్నిస్తోందని మోదీ ఆరోపించారు.