Home » Maharashtra
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమికి స్పష్టమైన మెజారిటీ వచ్చినా, ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో బీజేపీ, శివసేన, ఎన్సీపీ నేతలు ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు.
మహారాష్ట్ర కొత్త సీఎం రేసులో ఏక్నాథ్ షిండే ఉన్నారంటూ ఆయన వర్గం బలంగా చెబుతుండగా, మరోవైపు ఆయనపై ఉద్ధవ్ శివసేన వర్గం విమర్శలు ఎక్కుపెట్టింది. షిండే రాజకీయాల్లోంచి తప్పుకోవాలని డిమాండ్ చేసింది.
ఆదిత్య థాకరే ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వర్లి నియోజకవర్గం నుంచి 8,801 ఓట్ల ఆధిక్యతో గెలుపొందారు. ఆయనకు 63,324 ఓట్లు పోల్ కాగా, షిండే శివసేన నేత మిలంద్ దేవరకు 54,523 ఓట్లు, మహారాష్ట్ర నవనిర్మాణ సేన నేత సందీప్ సుధాకర్ దేశ్‌పాండేకు 19,367 ఓట్లు పోలయ్యాయి.
సీఎం రేసులో బీజేపీ నేత, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ముందంజలో ఉన్నారు. బీజేపీ పోటీ చేసిన 149 స్థానాల్లో 132 స్థానాలను ఆ పార్టీ గెలుచుకోవడంతో ఫడ్నవిస్‌కు మూడోసారి సీఎం పగ్గాలు అప్పగిస్తారనే వాదన బలంగా ఉంది. మరోవైపు సీఎం రేసులో ఏక్నాథ్ షిండే ఉన్నారని ఆ పార్టీ నేత సంజయ్ షిర్సత్ తెలిపారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహావికాస్ అఘాడి ఓటమి తర్వాత మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నానా పటోలే రాజీనామా చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలో 101 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ 16 స్థానాల్లో మాత్రమే గెలిచి 12.42 శాతం ఓట్లు సాధించింది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 236 సీట్లతో అధికార కూటమి మహాయుతి భారీ విజయం సాధించిన తర్వాత, ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఈరోజు నిర్ణయం తీసుకోనున్నారు. దేవేంద్ర ఫడ్నవిస్‌ను మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా చూడాలని బీజేపీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తమ కోరికను వ్యక్తం చేశాయి. మరోవైపు శివసేన అధ్యక్షుడు ఏక్నాథ్ షిండే కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు.
మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం సోమవారం కొలువుదీరనుంది..! ప్రస్తుత శాసనసభ కాలపరిమితి మంగళవారంతో ముగియనుంది.
మహారాష్ట్ర శాసనసభ పదవీకాలం నవంబర్ 26తో ముగుస్తుంది. శాసనసభ పదవీ కాలం ముగిసేలోపు కొత్త ప్రభుత్వం కొలువుదీరాల్సి ఉంటుంది. అంటే నవంబర్ 26లోపు మహాయుతి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఏర్పాటులో ఏదైనా ఆలస్యం జరిగి నవంబర్ 26లోపు సీఎం ప్రమాణ స్వీకారం జరగకపోతే..
మహారాష్ట్ర ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇవ్వడంతో మహాయుతి కూటమి కొలువుదీరనుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు భారీ మెజార్టీ సాధించారు. ఈ ఎన్నికల్లో అత్యధిక, అత్యల్ప మెజార్టీతో గెలుపొందిన అభ్యర్థులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో సీఎం, మంత్రి మండలి ప్రమాణ స్వీకర కార్యక్రమం సోమవారం జరిగే అవకాశముందని శిండే కేబినెట్లోని సీనియర్ మంత్రి దీపక్ ఆదివారం ముంబయిలో వెల్లడించారు.