Home » Mahbubnagar
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తిలో పర్యటించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు హెలికాప్టర్లో కల్వకుర్తికి బయలుదేరి వెళతారు. సాయంత్రం ఐదున్నర వరకు కల్వకుర్తిలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా బీఎస్ఎన్ఎల్ ప్రాంగణంలో జైపాల్ రెడ్డి సంస్మరణ సభ జరగనుంది.
జోగులాంబ గద్వాల జిల్లా: ఎర్రవల్లి చౌరస్తాలోని పెట్రోల్ పంపు దగ్గర జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వస్తున్న స్కార్పియో వాహనం.. లారీని ఢీ కొంది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
మహబూబ్ నగర్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు మద్దూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరుగుతుంది. మద్దూరు మండలం తిమ్మాజీ పల్లి గ్రామంలో బావాజీ జాతరకు సీఎం హాజరవుతారు.
మహబూబ్‌నగర్ జిల్లా: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపేటలో సోమవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో జన జాతర సభ జరగనుంది. సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం కానున్న సభకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి హాజరు కానున్నారు. జిల్లా కేంద్రంలోని జూనియర్ కాలేజీ మైదానంలో సభ జరగనుంది.
Barrelakka Marriage: బర్రెలక్క.. అలియాస్ ప్రిన్సెస్, అలియాస్ శిరీష(Shirisha).. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమె తీసుకున్న ఒక్క నిర్ణయం ఆమెను తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ దేశ వ్యాప్తంగా ఫేమస్ అయ్యేలా చేసింది. ఆ ఎన్నికల్లో(Telangana Assembly Elections) కంటెస్ట్ చేసి.. దేశ వ్యాప్తంగా యువత దృష్టిని తనవైపునకు తిప్పుకుంది. త్వరలోనే జరుగబోయే ఎంపీ ఎన్నికల్లోనూ(Loksabha Elections) పోటీ చేస్తానని..
హైదరాబాద్: నిన్న నగరంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ రాత్రికి రాజ్‌భవన్‌లో బస చేశారు. శనివారం ఉదయం ఆయన రాజ్ భవన్ నుంచి బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక హెలికాప్టర్లో నాగర్‌కర్నూల్‌కు బయలుదారారు.
హైదరాబాద్: దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారి నాగర్‌కర్నూల్ జిల్లాకు శనివారం రానున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నాగర్‌కర్నూల్‌కు వస్తున్నారు. దాంతో వెలమ సంఘం కల్యాణ మండపం పక్కన భారీ బహిరంగ సభ నిర్వహణకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్‌రావు ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు.
Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత డీకే అరుణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ అధికారంలో ఉన్నా ప్రతిపక్ష నాయకుడిలానే మాట్లాడారని... వాళ్లపై వాళ్లకే నమ్మకం లేదని వ్యాఖ్యలు చేశారు. ఏక్ నాథ్ షిండేలా ఎవరైనా వస్తే బీజేపీ ఆలోచిస్తుందన్నారు.
మహబూబ్ నగర్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాజకీయ బిక్ష పెట్టిన పాలమూరు జిల్లాను తీవ్ర అన్యాయం చేశారని, కృష్ణాజలాలను ఆంధ్ర పాలకులు దోచుకుపోతుంటే దద్దమ్మలా కేసీఆర్ చూస్తుండిపోయారని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు వంశీచంద్ రెడ్డి విమర్శించారు.
Telangana: ప్రజలు మూడోసారి మోడీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లాలో నిర్వహించిన విజయసంకల్ప యాత్రలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలో మోడీ అవినీతి రహితపాలన అందిస్తున్నారన్నారు.