Home » Mamata Banerjee
శ్రీరామనవమి సందర్బంగా పశ్చిమ బెంగాల్లో ( West Bengal ) నిర్వహించిన రామనవమి ఊరేగింపులో జరిగిన ఘర్షణలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే కారణం అని బీజేపీ మండిపడింది. రాష్ట్రంలోని ముర్షిదాబాద్‌లో బుధవారం రామనవమి ఊరేగింపు జరిగింది
కేంద్రంలోని బీజేపీ(BJP) సర్కార్ దేశాన్ని నిర్బంధ శిబిరంగా మార్చిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) విమర్శలు గుప్పించారు. అస్సాంలో టీఎంసీ అభ్యర్థులకు మద్దతుగా బుధవారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో దీదీ పాల్గొన్నారు.
పశ్చిమ బెంగాల్లో(West Bengal) శాంతి నెలకొంటే బీజేపీ(BJP) సహించదని సీఎం మమతా బెనర్జీ(CM Mamata Benerjee) సంచలన వ్యాఖ్యలు చేశారు. రామేశ్వరం బ్లాస్ట్ నిందితులను ఎన్ఐఏ కోల్‌కతాలో అదుపులోకి తీసుకున్న తరువాత బీజేపీ నేతలు బెంగాల్ సురక్షిత ప్రాంతం కాదని ఆరోపించారు.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు తృణముల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీ బంపర్ ఆఫర్ ఇఛ్చారు. డైమండ్ హార్బర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగాలని అమిత్ షాకు పిలుపు నిచ్చారు. పోని ఈ స్థానం నుంచి ఆయన పోటీ చేయకుంటే.. ఈడీ, సీబీఐ,ఎన్ఐఏ డైరెక్టర్లు అయినా ఇక్కడి నుంచి పోటీ చేయాలన్నారు.
బీజేపీ, ఎన్ఐఏ మధ్య అవగాహన ఉందని తృణమూల్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. ఎన్ఐఏ అధికారులతో బీజేపీ సభ్యుడు ఒకరు సమావేశమయ్యారని ఆరోపించారు.
పౌరసత్వ సవరణ చట్టం (CAA)పై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. సీఏఏ చట్టాన్ని కేంద్రం ఆమోదించిందని, కానీ సీఏఏకు దరఖాస్తు చేసుకుంటే మీ పౌరసత్వాన్ని కోల్పోతారంటూ ప్రజలను ఆమె తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు.
ప్రధాని మోదీ(PM Modi) చెబుతున్న "మోదీ కా గ్యారంటీ" అంటే ప్రతిపక్ష నేతలను జైల్లో వేయడమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) ఘాటు విమర్శలు చేశారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె జలపాయిగురిలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మోదీ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందన్నారు.
పశ్చిమ బెంగాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులపై దాడుల ఘటన పొలిటికల్ హీట్ పెంచుతోంది. దోపిడీ, అవనీతి చేసే వారిని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కాపాడుతోందని ప్రధాని నరేంద్ర మోదీ ( PM Modi ) ఫైర్ అయ్యారు.
పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద బోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీతో తనకు మంచి ఫ్రెండ్ షిప్ ఉండేదన్నారు. బెంగాల్ విద్యాశాఖ మంత్రి బ్రత్యా బసు వల్లే తమ మధ్య దూరం పెరిగిందని వివరించారు. బెంగాల్ యూనివర్సిటీ క్యాంపస్‌లను రాజకీయ కార్యకలాపాల కోసం ఉపయోగించే అంశంపై గవర్నర్ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే.
పశ్చిమ బెంగాల్ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ, బెంగాల్ సీఎం మమత బెనర్జీ మధ్య తీవ్ర మాటల యుద్దం జరుగుతోంది. కూచ్ బెహర్‌లో ఇద్దరు నేతలు నిన్న బహిరంగ సభల్లో మాట్లాడారు. ప్రధాని మోదీ ఆరోపణలను బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఖండించారు. జల్పాయ్ గురిలో జరిగిన ర్యాలీలో మమత మాట్లాడుతూ.. సందేళ్ ఖాళిలో మహిళలను లైంగికంగా వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నామని దీదీ వివరించారు.