Ramoji Rao: ఫిల్మ్ సిటీ కోసం పరితపించేవారు..!!
ABN , Publish Date - Jun 08 , 2024 | 01:52 PM
మీడియా ఐకాన్ రామోజీరావు ఈ రోజు తెల్లవారు జామున కన్నుమూశారు. రామోజీ మృతిపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినాయకురాలు మమతా బెనర్జీ స్పందించారు. తెలుగుజాతికి రామోజీరావు మార్గదర్శి అని కొనియాడారు. ఫిల్మ్ సిటీ సందర్శించాలని రామోజీ రావు తనను ఒకసారి ఆహ్వానించారని గుర్తుచేశారు.
హైదరాబాద్: మీడియా ఐకాన్ రామోజీరావు (Ramoji Rao) ఈ రోజు తెల్లవారు జామున కన్నుమూశారు. రామోజీ మృతిపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినాయకురాలు మమతా బెనర్జీ స్పందించారు. తెలుగుజాతికి రామోజీరావు మార్గదర్శి అని కొనియాడారు. ఫిల్మ్ సిటీ సందర్శించాలని రామోజీ రావు తనను ఒకసారి ఆహ్వానించారని గుర్తుచేశారు. ఆయన ఆహ్వానం మేరకు ఫిల్మ్ సిటీ చూశానని పేర్కొన్నారు. ఫిల్మ్ సిటీ చూస్తే మధురానుభూతి కలిగిందని వివరించారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అలు పెరగని పోరాటం
ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా రామోజీ రావు పోరాటం చేశారని సుప్రీంకోర్టు మాజీ సీజేఐ ఎన్వీ రమణ అభిప్రాయ పడ్డారు. నిత్యం తెలుగు ప్రజలతో రామోజీ రావు మమేకమై ఉంటారని పేర్కొన్నారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అమరావతి ఉద్యమానికి రామోజీరావు మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. వెలగపూడి దీక్షా శిబిరంలో రామోజీరావు చిత్రపటానికి రైతులు నివాళులర్పించారు.