Home » Mancherial district
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త ఉపాధ్యాయులు కొలువుదీరనున్నారు. డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు మంగళవారం కలెక్టరేట్లో పోస్టింగ్ అర్డర్లు అధికారులు కేటాయించారు. అనంతరం ర్యాంకింగ్ ఆధారంగా ఆయా పాఠశాలలకు ఉపాధ్యాయులను కేటాయిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు.
ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. వేమనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. ఆసుపత్రి పరిసరాలను, వార్డులను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్య సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, మందులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
గిరిజన గూడేల్లో గుస్సాడీ సందడి మొదలైంది. యేటా దసరా నుంచి దీపావళి పండుగ వరకు పద్మల్‌పూరీకాకో దేవాలయంలో దండారీ గుస్సాడీ వేడుకలు వైభవంగా నిర్వహిస్తారు. మండలంలోని గుడిరేవు గోదావరి నది తీరం ఒడ్డున పద్మల్‌పూరీకాకో దేవాలయం ఉంది. ఇక్కడ యేటా దసరా తర్వాత ఆశ్వీయుజ పౌర్ణమి గురువారంతో దండారీ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. దీపావళి అమావాస్యతో ఉత్సవాలు ముగుస్తాయి.
రెవెన్యూశాఖలో కీలకంగా వ్యవహరించి ప్రతీ ప్రభుత్వ కార్యక్రమాన్ని అన్నీ తామై నడిపించిన వీఆర్వో, వీఆర్ఏల వ్యవస్థను పునరుద్ధరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. గ్రామస్థాయిలో రెవెన్యూశాఖను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో రేవంత్ సర్కారు తిరిగి వారి సేవలను వినియోగించుకోవాలనే ఆలోచన చేస్తోంది.
పెండింగ్‌లో ఉన్న కళాశాల విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడంతో కళాశాలల పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని, బకాయిలను చెల్లించే వరకు నేటి నుంచి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు చేపడుతామని ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు, అధ్యాపకులు అన్నారు.
గ్రామీణ ప్రాంతాల అబివృద్ధిపై ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో సెంటర్ ఫర్ రూరల్ మేనేజ్మెంట్ నేషనల్ లెవెల్ మానిటర్స్ సభ్యులు బాలమురళి, సునీల్, డీఆర్డీవో కిషన్, జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తం నాయక్‌తో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు.
మున్నూరు కాపు ఉద్యోగ, విశ్రాంత ఉద్యోగులు, యువత సమాజ సేవలో భాగస్వాములైతేనే గుర్తింపు వస్తుందని సంఘం మండల అధ్యక్షకార్యదర్శు బొలిశెట్టి రాజన్న, పోల్లంపల్లి శ్రీనివాస్‌లు కోరారు. మండల కేంద్రంలో సోమవారం మండల మున్నూరు కాపు ఉద్యోగ, విశ్రాంత ఉద్యోగుల సంఘ సర్వసభ సమావేశం నిర్వహించారు.
కోల్‌బెల్ట్ ప్రాంతంలోని నిరుద్యోగు లకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేశామని మందమర్రి జీఎం దేవేందర్ తెలిపారు. సోమ వారం పట్టణంలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో కంప్యూటర్ డీటీపీకోర్సులను ప్రారం భించి మాట్లాడారు.
దసరా పండుగ వ్యాపారం జిల్లాలో జోరుగా సాగింది. గతేడాదితో పోల్చితే మద్యం, ఇతర వ్యాపారాల్లో విక్రయాలు పెరిగాయి. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్, లక్షెట్టిపేట ఎక్సైజ్ సర్కిళ్ల పరిధిలో ఈ నెల 10, 11 తేదీల్లో రూ.8.87 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరి గాయి.
దసరా వేడుకలు ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఉదయం పలు ఆలయాలను సందర్శించారు. అనంతరం జమ్మి పూజలో పాల్గొని ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పలుచోట్ల రాంలీల కార్యక్రమాన్ని నిర్వహించారు. రాంలీల కార్యక్రమాన్ని చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో ఆనందంగా గడిపారు. పలు ఆలయాలు, దుర్గ మండపాల వద్ద వాహన పూజలు నిర్వహించారు.