Home » Mancherial district
మహిళల అభ్యు న్నతికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే గడ్డం వివేక్‌వెంకటస్వామి అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహాలక్ష్మీ లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాలను అందించారు. ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం అన్ని నెర వేరుస్తున్నారన్నారు.
విద్యార్థి దశలో వ్యర్థాలకు అర్ధవంతమైన రూపం తీసుకుని పునర్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్ అన్నారు. శుక్రవారం జిల్లా సైన్స్ కేంద్రంలో నేషనల్ గ్రీన్ కోర్ ఆధ్వర్యంలో వ్యర్ధం నుంచి అర్ధం అనే అం శంపై నిర్వహించిన ఆర్ట్, క్రాప్ట్ ఎగ్జిబిషన్‌ను డీఈవో యాదయ్యతో కలిసి పారరంభించారు.
రామకృష్ణాపూర్ పోలీస్‌స్టేషన్‌ను సీపీ శ్రీనివాస్ శనివారం ఆకస్మికంగా సందర్శించారు. పోలీస్‌స్టేషన్ పరిసరాలను సందర్శించి పిటిషన్, రికార్డులను తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరు, కేసు లలో ప్లాన్ ఆఫ్ యాక్షన్, మిస్సింగ్, కైరమ్ కేసులలో ప్రధానమైన సాక్ష్యులతో మాట్లాడి వివరాలు సేకరించాలని సూచించారు.
విద్యార్థులు విభిన్న తార్కిక ఆలోచనల ద్వారానే శాస్త్రవేత్తలుగా తయా రవుతారని జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య అన్నారు. శనివారం మండల కేంద్రంలోని జిల్లా పరి షత్ పాఠశాలలో అటల్ టింకర్ ల్యాబ్ ప్రాజెక్టుల ప్రదర్శనలో భాగంగా ల్యాబ్‌లో విద్యార్థుల ప్రదర్శన లను పరిశీలించారు.
జిల్లాలోని హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, దాబాల్లో అపరిశుభ్రత నెలకొంటుంది. రోజుల తరబడి నిల్వ చేసిన ఆహార పదార్ధాలతో వంటకాలు తయారు చేస్తు న్నారు. కుళ్లిన కూరగాయలు, మాంసం, నాణ్యత లేని పదార్ధాలు, కాలం చెల్లిన మసాలాలు వినియోగిస్తున్నారు.
మండలంలోని గుడిపేట 13వ పోలీసు బెటాలి యన్ను శుక్రవారం రాష్ట్ర ప్రత్యేక పోలీసు బెటాలియన్ల అదనపు డీజీపీ సం జయ్‌కుమార్ జైన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బెటాలియన్‌కు వచ్చిన ఆయనకు రామగుండం సీపీ శ్రీనివాస్, డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాష్, బెటాలియన్ కమాండెంట్ వెంకటరాములు పుష్ప గుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు.
జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టర్‌లో జిల్లా వ్యవసాయాధికారి కల్పన, జల్లా యువజన క్రీడ అధికారి కీర్తి రాజ్‌వీరు, లయన్స్ క్లబ్ ప్రతినిధులతో కలిసి ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా పోస్టర్లను విడుదల చేశారు.
మహాలక్ష్మీ పథకం లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పత్రాలను శుక్రవారం ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి అందజేశారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు.
మహానీయులు చూపిన మార్గం అందరికి ఆదర్శనీయమని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి నిర్వహిం చారు. కలెక్టర్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
జిల్లాలో ధాన్యం రవాణా చేసే లారీల టెండర్లు ఈసారైనా జరిగేనా అనే సందేహాలు వ్యక్తమవుతు న్నాయి. ప్రతిసారీ ధాన్యం రవాణాకు లారీలకు టెండర్లు ఆహ్వానించడం అనంతరం నేరుగా పనులు అప్పగించడం జిల్లాలో కొన్నాళ్లుగా ఆనవాయి తీగా వస్తోంది.