Home » Mancherial
రాష్ట్ర ప్రభుత్వం పాత పింఛన్ విధానం వెంటనే అమలు చేయాలని సీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాముక కమలాకర్ అన్నారు. సోమవారం జన్నారం మండల కేంద్రంలో నిర్వహించిన ఉద్యోగ, ఉపాధ్యాయుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
నర్సరీల బాధ్యతల నుంచి తమను తప్పించాలని సోమవారం డీఆర్డీఏ పీడీ కిషన్‌కు కార్యదర్శులు వినతిపత్రం అందించారు. వారు మాట్లాడుతూ గ్రామపంచాయతీలకు ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో అప్పులు చేస్తూ పంచాయతీలను నడుపుతున్నామన్నారు.
గిరిజన సంస్కృతీ, సంప్ర దాయాలను కాపాడేది ఆదివాసి గిరిజనులేనని రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్లు అన్నారు. గుడిరేవు గోదావరి నది ఒడ్డున పద్మల్‌పూరీ కాకో ఆలయంలో ఆదివారం దండారీ ఉత్సవాలు అట్టహా సంగా ప్రారంభమయ్యాయి.
మాదిగలకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్‌రెడ్డి నిలబెట్టుకోవాలని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు చెన్నూరి సమ్మయ్య మాదిగ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని చార్వాక హాలులో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సింగరేణికి భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్యే కొక్కి రాల ప్రేంసాగర్‌రావు అన్నారు. ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో సింగరేణి, కాంట్రాక్టు, రిటైర్డ్ కార్మికుల ఆత్మీయ సదస్సు శ్రీరాంపూర్‌లో ఆదివారం రాత్రి నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో కంటే సింగరేణి కార్మికులకు మెరుగైన లాభాల వాటా ఇప్పించామన్నారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో హిందూ శ్మశాన వాటిక నిర్మాణానికి ఎట్టకేలకు లైన్‌క్లియర్ అయింది. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు చొరవతో గోదావరి సమీపంలోని భూదాన్ యజ్ఞ బోర్డు భూముల్లో నిర్మాణానికి మార్గం సుగమమైంది.
మాజీ పార్లమెంట్ సభ్యులు గడ్డం వెంకటస్వామి సేవలు మరువలేనివని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో ఏర్పాటు చేసిన గడ్డం వెంకటస్వామి జయంతి కార్యక్రమానికి అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, డీఆర్డీవో కిషన్లతో కలిసి పాల్గొన్నారు.
ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలెట్ ప్రాజెక్టు సర్వే నివేదిక స్పష్టంగా రూపొందించాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే ప్రత్యేకాధికారి, రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి అన్నారు. శనివారం కలెక్టరేట్లో కలెక్టర్ కుమార్‌దీపక్‌తో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు.
వానాకాలం సంబంధించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో సహకార అధికారి సంజీవరెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి కల్పన, డీఆర్డీవో కిషన్, పౌరసరపరాల అధికారి బ్రహ్మరావుతో కలిసి కొనుగోలు కేంద్రాల ఇన్చార్జీలు, సీఈవోలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
చెన్నూరు పట్టణంలోని శన గకుంట చెరువు మత్తడి ధ్వంసం కేసులో ప్రధాన నిందితులైన చెన్నూరు మున్సిపల్ చైర్పర్సన్ అర్చన గిల్డా భర్త రాంలాల్‌గిల్డా, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తుల సమ్మయ్యతోపాటు ఎన్నం బానయ్య లను అరెస్టు చేసినట్లు జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం ఏసీపీ కార్యాలయంలో విలే కరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.