Home » Mancherial
వానా కాలం సీజన్‌కు సంబంధించి జిల్లా వ్యాప్తంగా వరి కోతలు ప్రారంభమైనప్పటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో తీవ్ర జాప్యం జరుగుతోంది. వరికోతలు ప్రారంభించక ముందే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించా లని భావించినా ఆచరణలో అమలు కావడంలేదు. ఫలితంగా కోతలు పూర్తయి పంట చేతికి వచ్చిన రైతులు ప్రైవేటు మార్కెట్‌ను ఆశ్రయించక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.
గూడెంగుట్టపై కొలువుదీరిన రమాసహిత సత్యనారాయణ ఆలయంలో శుక్రవారం జరిగే కార్తీక పౌర్ణమి మహాజాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని పలు జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు రానున్నారు.
వ్యాపా రులపై కక్షతోనే కూల్చివేతలు చేపడుతున్నారని మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు పేర్కొన్నారు. గురువారం అర్చనటెక్స్ చౌరస్తా వద్ద నిర్మి స్తున్న డ్రైనేజీ పనులను పరిశీలించారు. ఆయ న మాట్లాడుతూ అర్చనటెక్స్ చౌరస్తా నుంచి మార్కెట్ రోడ్డు వెడల్పును మున్సిపల్ అధికా రులు ఎలాంటి టెండర్లు నిర్వహించకుండ చేపట్టారన్నారు.
గురుకుల పాఠశాలల విద్యార్థినులు చదువుతోపాటు క్రీడల్లో రాణించి రాష్ట్రానికి గుర్తింపు తీసుకురావాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల మైదానంలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న కాళేశ్వరం జోన్ 10వ క్రీడా పోటీలు ముగిసాయి. ఎంపీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
మంచిర్యాల మున్సిపాలిటీలోని అండాళమ్మ కాలనీ మున్సిపల్ చెత్తతో కంపు కొడుతోంది. రహదారులు, ఇళ్లకు సమీపంలో చెత్త డంప్ చేస్తుండటంతో దుర్వాసనకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. డంప్ యార్డును ఎత్తివేయాలని కాలనీవాసులు ఆందోళనలు చేపట్టినప్పటికీ ఫలితం ఉండటంలేదు.
ఆర్మూర్ నుంచి మంచిర్యాల వరకు నిర్మించే గ్రీన్‌ఫీల్డ్ హైవే విస్తరణలో భూముల కోల్పోతున్న నిర్వాసితులకు న్యాయం చేయాలని హాజీపూర్, లక్షెట్టిపేట మండలాలకు చెందిన రైతులు కలెక్టరేట్ ఎదుట మంగళవారం ధర్నా చేశారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం భూములకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
జిల్లాలో ఈ నెల 17,18 తేదీల్లో జరగనున్న గ్రూప్ 3 పరీక్షను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో డీసీపీ భాస్కర్, అదనపు కలెక్టర్ మోతిలాల్, ఆర్డీవోలు శ్రీనివాస్‌రావు, ఏసీపీ ప్రకాష్, డీఈవో యాదయ్యతో కలిసి అధి కారులతో సమావేశం నిర్వహించారు.
18 సంవత్స రాలు నిండిన వారందరు ఓటరు జాబితాలో వివరాలు నమోదు చేసుకోవాలని ఓటర్ల జాబితా పరిశీలకులు సురేంద్రమోహన్ అన్నా రు. మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ మోతిలాల్, ఆర్డీవోలు శ్రీనివాసర్రావు, హరికృష్ణ, చంద్రకళతో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు.
జిల్లాలో ఏజెన్సీ భూముల కబ్జా కొనసాగుతోంది. గిరిజన చట్టాలకు తూట్లు పొడుస్తూ గిరిజనేతరులు భూములు కబ్జా చేస్తున్నారు. ఈ తంతు బహిరంగంగా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దండేపల్లి మండలం ముత్యంపేట గ్రామం ఏజెన్సీ ప్రాంతంలో ఉంది. ఇక్కడ గిరిజన చట్టాలైన 1/70, పెసా చట్టాలు అమలులో ఉన్నాయి.
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఐకేపీ, వీవోఏ ఉద్యోగుల సంఘం (సీఐటీయు) ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట సోమవారం 48 గంటల ధర్నా చేపట్టారు. డిమాండ్లను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు.