Share News

Mohan Babu Court Case: మోహన్‌బాబుకు గట్టి ఎదురుదెబ్బ

ABN , Publish Date - Apr 09 , 2025 | 03:45 PM

Mohan Babu Court Case: మంచు ఫ్యామిలీ వివాదం రాష్ట్రంలో ఎంతటి దుమారాన్ని రేపిందో అందరికీ తెలిసిందే. ఆస్తులపై కోర్టుకు కూడా వెళ్లారు మోహన్ బాబు. ఇప్పుడు మోహన్ బాబుకు గట్టి షాకే తగిలింది.

Mohan Babu Court Case: మోహన్‌బాబుకు గట్టి ఎదురుదెబ్బ
Mohan Babu Court Case

హైదరాబాద్, ఏప్రిల్ 9: సినీ నటుడు మంచు మోహన్‌ బాబుకు (Manchu Mohan Babu) ఎల్బీనగర్ కోర్టులో (LB Nagar Court) చెక్కుదురైంది. జల్‌పల్లిలోని ఇంటి వివాదంపై గతంలో మోహన్‌ బాబు కోర్టులో పిటిషన్‌ వేశారు. మంచు మనోజ్ ఇంట్లోకి రాకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటీషన్ వేశారు. ఇంట్లో ఇబ్బందులు గురి చేస్తున్నాడంటూ మంచు మనోజ్‌పైన కోర్ట్‌ను ఆశ్రయించారు మోహన్ బాబు. గతంలో మోహన్ బాబుకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే కోర్ట్‌ను తప్పుదోవ పట్టించారంటూ కొన్ని ఆధారాలను మనోజ్ న్యాయవాది కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. దీంతో మోహన్ బాబుకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును కొట్టివేసింది ఎల్బీనగర్ కోర్టు. అంతే కాకుండా తప్పిదంకు పాల్పడిన కోర్ట్ క్లర్క్‌కు న్యాయస్థానం మెమో జారీ చేసింది.


మరోవైపు మంచు ఫ్యామిలీ వివాదాలకు ఇంకా ఫుల్‌స్టాప్ పడినట్లు లేదు. ఆస్తులకు సంబంధించి మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మంచు మోహన్‌ బాబు, మంచు విష్ణు ఒకటిగా ఉండగా... మంచు మనోజ్ మాత్రం ఒంటరిగానే పోరాడుతున్నారు. జల్‌పల్లిలోని నివాసానికి సంబంధించి ఇప్పటికే మోహన్‌బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు కూడా. తన ఇంట్లో ఉన్న వారిని ఖాళీ చేయిచాలంటూ పోలీసులకు తెలిపారు. దీనికి సంబంధించి విచారణకు రావాల్సిందిగా మంచు మనోజ్‌నోటీసులు కూడా వెళ్లాయి. మనోజ్ విచారణను కూడా ఎదుర్కున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా జల్‌పల్లిలోని నివాసం వద్ద ఉదయం నుంచి ఉద్రిక్తత నెలకొంది. జల్‌పల్లి నివాసంలోకి తనను రానీయడం లేదంటూ ఇంటి వద్ద కూర్చుని మంచు మనోజ్ ఆందోళనకు దిగారు. దీంతో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. అంతేకాకుండా జల్‌పల్లి నివాసం పరిసరాల్లోకి ఎవరూ రాకుండా అడ్డుకున్నారు.

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్ కేసు.. ప్రధాన నిందితుడి పాస్‌పోర్ట్ రద్దు


అయితే జల్‌పల్లి నివాసంలో చోరీ జరిగిందని మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన అన్న మంచు విష్ణు ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేయడంతో పాటు కార్లను దొంగలించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన అనంతరం కార్లను పోలీసులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. కానీ మనోజ్‌ను జల్‌పల్లి నివాసంలోకి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఇంటి వద్దే మనోజ్ నిరసనకు దిగారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఏప్రిల్ 1న పాప పుట్టినరోజు కోసం జైపూర్ వెళ్ళానని.. అదేరోజు తన ఇంట్లో విధ్వంసం చేశారని మనోజ్ తెలిపారు. ఈ గొడవలను కావాలనే ఫ్యామిలీ గొడవగా మార్చిపిచ్చోళ్లను చేస్తున్నారని మండిపడ్డారు. తమది ఆస్తి గొడవ కాదని.. స్టూడెంట్ విషయాల్లో స్టార్ట్ అయిన గొడవ అని చెప్పారు. తాను ఊర్లో ఉన్నప్పుడు ఏమీ చేయడం చేతగాక ఊరు దాటిన వెంటనే విష్ణు ప్లానింగ్‌తో ఇల్లు ధ్వంసం చేశారని మండిపడ్డారు. ‘నా జుట్టు విష్ణు చేతికి వెళ్ళాలి అన్నది అతని లక్ష్యం ’ అంటూ వాపోయాడు. జల్‌పల్లి ఇంట్లోకి వెళ్లడానికి అన్ని అనుమతులు ఉన్నప్పటికీ పోలీసులు మాత్రం వెళ్లనీయడం లేదని మంచు మనోజ్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

Trump China Tariffs: చైనాపై ట్రంప్‌ బాదుడు 104 శాతానికి!

Saif Ali Khan Stabbing Case: సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో కీలక పరిణామం..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 09 , 2025 | 05:04 PM