Manchu Manoj: నా జుట్టు విష్ణు చేతికి వెళ్ళాలన్నది అతని లక్ష్యం..
ABN , Publish Date - Apr 09 , 2025 | 01:23 PM
తమది ఆస్తుల గొడవ కాదని.. స్టూడెంట్ విషయాల్లో ప్రారంభమైన గొడవ అని మంచు మనోజ్ తెలిపారు. తన ఇంట్లో జరిగిన బీభత్సంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. మీరు ఇక్కడ ఉండడం లేదు కదా అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని అన్నారు. ఇప్పటి వరకు మూడు ఎఫ్ఐఆర్లు అయినా పహాడీ షరీఫ్ ఇన్స్‌పెక్టర్ ఒక్క ఛార్జ్ షాట్ కూడా ఫైల్ చేయలేదుని ఆరోపించారు.

హైదరాబాద్: సినీ నటుడు మోహన్ బాబు (Actor Mohan Babu) జల్‌పల్లి (Jalpalli)లోని ఆయన ఇంటి వద్ద బుధవారం మరోసారి ఉద్రిక్తత (Tension) నెలకొంది. తనను ఇంట్లోకి రానివ్వడం లేదంటూ మంచు మనోజ్ (Manchu Manoj) నిరసనకు (Protest) దిగారు. మోహన్ బాబు ఇంటి గేటు వద్ద కూర్చుని మనోజ్ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధి జెల్‌పల్లి వద్ద ఉన్న మంచు టౌన్ వద్దకు భారీగా పోలీసులు (Police) చేరుకున్నారు. మంచు టౌన్ వద్దకు ఎవరిని అనుమతించనడం లేదు. ఈ సందర్భంగా మంచు మనోజ్ మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 1న తన పాప పుట్టినరోజు కోసం జైపూర్ వెళ్ళానని.. అదే రోజు తన ఇంట్లో విధ్వంసం చేశారని తెలిపారు. ఈ గొడవలను కావాలనే ఫ్యామిలీ గొడవగా మార్చి పిచ్చొళ్లను చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read..: వైద్యుల పర్యవేక్షణలో మార్క్ శంకర్..
మాది ఆస్తి గొడవ కాదు...
తమది ఆస్తుల గొడవ కాదని.. స్టూడెంట్ విషయాల్లో ప్రారంభమైన గొడవ అని మంచు మనోజ్ తెలిపారు. తన ఇంట్లో జరిగిన బీభత్సంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. మీరు ఇక్కడ ఉండడం లేదు కదా అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని అన్నారు. ఇప్పటి వరకు మూడు ఎఫ్ఐఆర్లు అయినా పహాడీ షరీఫ్ ఇన్స్‌పెక్టర్ ఒక్క ఛార్జ్ షాట్ కూడా ఫైల్ చేయలేదుని ఆరోపించారు. అన్నీ ఆధారాలు ఉన్నా కూడా చార్జ్ షీటు ఫైల్ చేయలేదన్నారు. తాను ఊర్లో ఉన్నప్పుడు తనను ఏమీ చేయడం చేతగాక ఊరు దాటిన వెంటనే విష్ణు ఓ ప్లాన్ ప్రకారం తన ఇల్లు ధ్వంసం చేశాడని తెలిపారు. రాచకొండ కమిషనర్ బైండోవర్‌ను కూడా మంచు విష్ణు క్రాస్ చేశాడని అన్నారు.
నా తప్పు ఉంటే ఆధారాలు చూపాలి..
తాను తప్పు చేసినల్లు చెప్పడానికి విష్ణు దగ్గర ఒక్క ఆధారం ఉన్నా చూపించాలని మంచు మనోజ్ అన్నారు. తన ఇల్లు ధ్వంసం చేశారని, కార్లు రోడ్డు మీదకు తీసుకుని వచ్చి వదిలారని ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నప్ప సినిమాకు పోటీగా భైరవ చిత్రం రిలీజ్ చేస్తున్నాని తనపై కోపం పెంచుకున్నారని, కూర్చుని మాట్లాడదామని అడుగుతున్నా.. విష్ణు ముందుకు రావడం లేదని చెప్పారు. హైకోర్టు నుండి జల్‌పల్లి నివాసంలో ఉండటానికి నాకు ఆదేశాలు ఉన్నాయని, కోర్టును తప్పుదోవ పట్టించి కింది కోర్టులో తప్పుడు ఉత్తర్వులు తీసుకుని వచ్చారని తెలిపారు. తిరిగి తాను కోర్టును ఆశ్రయించడంతో కిందికోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేసిందిన్నారు.
ఆ ఇంటికి వెళ్లడానికి నాకు అనుమతులు ఉన్నాయి..
జల్‌పల్లి ఇంట్లోకి వెళ్లడానికి తనకు అన్ని అనుమతులు ఉన్నాయని.. అయినా పోలీసులు తనను వెళ్ళనివ్వడం లేదని మంచు మనోజ్ తెలిపారు. తన కుటుంబం నుండి ఒక రూపాయి కూడా తీసుకోలేదని.. విష్ణు కెరియర్ కోసం అమ్మాయి గెటప్ వేసానని చెప్పారు. తన ఇంట్లో పెట్స్ ఉన్నాయని, కాళ్ళు పట్టుకుంటానని అన్నా కూడా పోలీసుల కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయమని ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంలను కోరుతున్నానన్నారు. పహాడీ షరీఫ్ పోలీసులు తనను ఇంట్లోకి ఎందుకు అనుమతించడం లేదో రాతపూర్వకంగా ఇస్తే కోర్టుకు చెప్పుకుంటానన్నారు. తన జుట్టు విష్ణు చేతికి వెళ్ళాలన్నది అతని లక్ష్యమని, క్యాంపస్‌లో జరుగుతున్న అక్రమాలు.. విష్ణు దొంగతనాల గురించి ప్రశ్నించినందుకు తనపై కోపం పెంచుకున్నారని,తాను కర్మ సిద్ధాంతం నమ్ముతాను.. తనను ఇబ్బంది పెట్టిన వాళ్ళు కర్మ అనుభవిస్తారని మంచు మనోజ్ అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
చంద్రబాబు కొత్త ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన
గుంటూరు అవతలవారిని నరికేస్తాం.. ఇవతలవారిని లాక్కొచ్చి కొడతాం
For More AP News and Telugu News