Home » Mangalagiri
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. సమగ్ర అధ్యయనం తర్వాతే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామన్నారు. నిస్వార్ధంగా కష్టపడితే అధికారం దానంతటదే వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఎవరికి ఏ కష్టం వచ్చినా అన్ని వర్గాల వారికి వంగవీటి మోహనరంగా అండగా నిలిచారని ఆయన తనయుడు వంగవీటి రాధాకృష్ణ తెలిపారు. పాతురులో రంగా విగ్రహావిష్కరణలో రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. పాతూరులో తన తండ్రి, పెదనాన్న విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. ఈ విగ్రహాలకు ఎమ్మెల్యే ఆర్కే సహకారం అందించారని వెల్లడించారు. ఒక నాయకుడు మరణించి మూడు దశాబ్దాలు దాటినా స్మరిస్తూనే ఉన్నారని.. తనది మానవ కులం అని చాటి చెప్పిన వ్యక్తి వంగవీటి మోహనరంగా అని గుర్తుచేశారు.
వంగవీటి మోహనరంగా పేదల కోసం జీవితం త్యాగం చేశారని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. పాతూరులో వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే, వంగవీటి రాధాకృష్ణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు గంజి చిరంజీవి, మురుగుడు హనుమంతరావు, జనసేన నుంచి చిల్లపల్లి శ్రీనివాసరావు, పోతిన వెంకట మహేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్కే మాట్లాడారు. వంగవీటి మోహనరంగా పేదల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేశారని గుర్తుచేశారు. అటువంటి మహనీయులు అందరికీ ఆదర్శనీయం అని తెలిపారు.
ఏకలవ్యుడు అంటే గుర్తు వచ్చేది మహా భారతం. బొటనవేలును త్యాగం చేసిన వ్యక్తి ఏకలవ్యుడు. ఎరుకుల సామాజికవర్గానికి న్యాయం చేసింది టీడీపీనే. వైసీపీ ప్రభుత్వంలో పేదలకు అన్యాయం జరుగుతుంది. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎరుకుల కులస్తులకు న్యాయం చేస్తా
అమరావతి: మాలల్లో వచ్చిన చైతన్యంతో రాష్ట్రానికి పట్టిన శని వదులుతుందని నమ్ముతున్నానని, ఇందిర, వైఎస్, జగన్ వెంటే మాలలు ఉన్నారనే ప్రచారానికి మీరే చెక్ పెట్టాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపిచ్చారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్లకు సంబంధించిన జగన్ చేసిన ప్రకటనతో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యేలు కలవరపాటుకు గురయ్యారు. ఎవరికి వారు ఆ జాబితాలో తాము ఉన్నామేమోనని ఉలికిపడే పరిస్థితి నెలకొంది.
ధర్మ పరిరక్షణ.. ప్రజా క్షేమం.. సామాజిక పరివర్తన ఆకాంక్షిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యాగం చేపట్టారు. మంగళగిరిలో జనసేన రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఈ యాగం జరుగుతోంది.
ఎట్టకేలకు వైసీపీ అధిష్ఠానం మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డిపై వేటు వేసేందుకు సిద్ధమైంది. అధిష్ఠానం తీరుతో కొంతకాలంగా ఆర్కే తన నియోజకవర్గ పరిధిలోనే ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మొఖం చూసేందుకు కూడా ఇష్టపడకపోవటమే కాకుండా పార్టీ సూచించిన కార్యక్రమాలను కూడా బహిష్కరించిన విషయం తెలిసిందే.
వైసీపీ పెద్దలకు గుంటూరు జిల్లాలో ఆ పార్టీ పరిస్థితులు వణుకు పుట్టిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో ప్రతి నియోజకవర్గంలోనూ..
ఆళ్ల మైనింగ్ మాఫియాపై పోరాడిన టీడీపీ నేతలను అభినందిస్తున్నానని లోకేష్ తెలిపారు.