Share News

Nara Lokesh Nomination: లోకేష్ తరఫున నేడు నామినేషన్..

ABN , Publish Date - Apr 18 , 2024 | 09:48 AM

అమరావతి, ఏప్రిల్ 18: టీడీపీ యువనేత నారా లోకేష్(Nara Lokesh) తరఫున ఇవాళ ఎన్నికల నామినేషన్(Election Nomination) దాఖలు చేయనున్నారు కూటమి నేతలు. టీడీపీ(TDP)-జనసేన(Janasena)-బీజేపీ(BJP) ముఖ్యనేతల చేతుల మీదుగా 2 సెట్ల నామినేషన్లు దాఖలు చేయనున్నారు. గురువారం నాడు మంగళగిరిలో(Mangalagiri) సర్వమత ప్రార్థనలతో..

Nara Lokesh Nomination: లోకేష్ తరఫున నేడు నామినేషన్..
Nara Lokesh Nomination

అమరావతి, ఏప్రిల్ 18: టీడీపీ యువనేత నారా లోకేష్(Nara Lokesh) తరఫున ఇవాళ ఎన్నికల నామినేషన్(Election Nomination) దాఖలు చేయనున్నారు కూటమి నేతలు. టీడీపీ(TDP)-జనసేన(Janasena)-బీజేపీ(BJP) ముఖ్యనేతల చేతుల మీదుగా 2 సెట్ల నామినేషన్లు దాఖలు చేయనున్నారు. గురువారం నాడు మంగళగిరిలో(Mangalagiri) సర్వమత ప్రార్థనలతో ఈ ర్యాలీ ప్రారంభం కానుంది. ప్రజల సమక్షంలో కూటమికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నేతలు గురువారం నారా లోకేష్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. మధ్యాహ్నం 2.34 గంటలకు మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో లోకేష్ తరఫున నామినేషన్ వేయనున్నారు. లోకేష్ నామినేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని కూటమి నేతలు నిర్ణయించారు. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి నేతలు లోకేష్ నామినేషన్ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించాలని ప్లాన్ చేశారు. నియోజకవర్గం నలుమూలల నుంచి 10వేల మందికిపైగా కార్యకర్తలు, అభిమానులతో భారీగా ర్యాలీ తీయాలని నిర్ణయించారు.


నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ..

సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి ఈనెల 18వ తేదీన అంటే గురువారం నాడు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఈనెల 18వ తేదీ నుంచి 25వతేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరిస్తారు. ఈనెల 26వ తేదీన నామినేషన్ల పరిశీలన, 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు వీలుంటుంది. అనంతరం గుర్తుల కేటాయింపు జరుగుతుంది. పోటీలో నిలిచిన అభ్యర్థులను ప్రకటిస్తారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 18 , 2024 | 09:49 AM