AP Election 2024:ఆ రెండు నియోజకవర్గాలకు జగన్ డబ్బులు పంపించారు: నారా లోకేష్
ABN , Publish Date - May 10 , 2024 | 09:09 PM
ఈ ఎన్నికల్లో ప్రలోభాల కోసం కుప్పం, మంగళగిరికి జగన్ రూ.300 కోట్ల చొప్పున పంపారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ (Nara Lokesh) సంచలన ఆరోపణలు చేశారు. పాపపు సొమ్ము ఓటుకు రూ.10వేలు ఇస్తారట.. తీసుకోవాలని.. ఓటు మాత్రం కూటమి అభ్యర్థులకు వేయాలని పిలుపునిచ్చారు.
అమరావతి: ఈ ఎన్నికల్లో ప్రలోభాల కోసం కుప్పం, మంగళగిరికి జగన్ రూ.300 కోట్ల చొప్పున పంపారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ (Nara Lokesh) సంచలన ఆరోపణలు చేశారు. పాపపు సొమ్ము ఓటుకు రూ.10వేలు ఇస్తారట.. తీసుకోవాలని.. ఓటు మాత్రం కూటమి అభ్యర్థులకు వేయాలని పిలుపునిచ్చారు. మంగళగిరి నియోజకవర్గంలో శుక్రవారం రచ్చబండ సభ నిర్వహించారు. ఈ సభ లో యువనేత లోకేష్ మాట్లాడారు.
AP Election 2024: వైసీపీ కోసం.. లూప్‌లైన్ ‘వ్యూహం’
ఇసుక, మద్యం, గంజాయి ద్వారా అడ్డగోలుగా జగన్ దోచుకున్నారని మండిపడ్డారు. కుప్పం, మంగళగిరి నియోజకవర్గాలకు రూ. 300 కోట్ల చొప్పున దోపిడీ సొమ్ము పంపించారని విమర్శించారు. ఈ రెండు నియోజకవర్గాల్లో ఓటుకు 10వేల రూపాయలు చొప్పును ఇవ్వాలని జగన్ నిర్ణయించారని అన్నారు. గత అయిదేళ్లుగా ఒక్కో ఓటరు వద్దనుంచి జగన్ లక్షరూపాయలు దోచుకున్నారని ధ్వజమెత్తారు. ఇప్పుడు ఖర్చుచేస్తున్నది పదోవంతేనని చెప్పుకొచ్చారు. ఆ డబ్బు తీసుకొని ఓటు మాత్రం నిరంతరం ప్రజలకోసం శ్రమిస్తున్న తమకు వేయాలని కోరారు.
మంగళగిరికి కంపెనీలే వచ్చే అవకాశం లేదని ఎమ్మెల్యే ఆర్కే చెబుతున్నారని అన్నారు. తాను మంత్రిగా ఉండగా మంగళగిరి ఆటోనగర్‌లో తెచ్చిన పైకేర్ అనే సాఫ్ట్వేర్ కంపెనీలో ఈరోజు 580మంది పనిచేస్తున్నారని వివరించారు. అధికారంతో పాటు అభివృద్ధి చేయాలనే సంకల్పం కూడా ఉంటేనే ఇది సాధ్యమని తెలిపారు. ప్రజాప్రభుత్వం వచ్చిన వెనువెంటనే రాజధాని పనులు ప్రారంభించి యువతకు స్థానికంగా ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రతిఏటా సింగిల్ జాబ్ నోటిఫికేషన్‌తో ప్యూన్ నుంచి గ్రూప్-1 వరకు ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీచేస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు.
AP Election 2024 : విజన్ X విధ్వంసం.. చంద్రబాబు, జగన్‌కు తేడా ఇదే
Read Latest AP News And Telugu News