Home » Manipur
మయన్మార్ నుంచి మణిపూర్ రాష్ట్రానికి అక్రమంగా తరలివస్తున్నారు. రెండు రోజుల్లోనే 718 మంది అక్రమంగా ఈ రాష్ట్రంలో చొరబడటంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. సరిహద్దు భద్రత బాధ్యతను నిర్వహిస్తున్న అస్సాం రైఫిల్స్‌ను వివరణ కోరింది. సరైన పత్రాలు లేనివారిని భారత దేశంలోకి ప్రవేశించేందుకు ఏ విధంగా అనుమతించారని ప్రశ్నించింది.
రెండు జాతుల మధ్య వైరంతో కల్లోలితంగా మారిన మణిపూర్(Manipur) రాష్ట్రంలో పోలీసుల ముందు ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. రెండున్నర నెలలుగా జరుగుతున్న హింసకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి.
మణిపూర్‌లో కుకీ తెగకు చెందిన ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన దారుణ ఘటనపై ప్రతిపక్షాల నిరసనలతో పార్లమెంటు సోమవారం కూడా దద్దరిల్లింది.
మణిపూర్ లో రెండు నెలల క్రితం మొదలైన మొదలైన హింసాకాండకు తెర పడటం లేదు. శాంతియుత నిరసన ప్రదర్శనకు పోలీసులు అనుమతించడంతో సోమవారంనాడు ర్యాలీ నిర్వహించిన పలువురు మహిళలు కేంద్ర మంత్రి ఆర్కే రంజన్ సింగ్ నివాసం వద్దకు రాగానే కట్టుతప్పారు. ఆయన ఇంటిపై రాళ్లు రువ్వారు.
మణిపూర్ హింసాకాండపై చర్చ విషయంలో తలెత్తిన ప్రతిష్ఠంభన కొనసాగడంపై కాంగ్రెస్ పార్టీ ఘాటు విమర్శలు గుప్పించింది. ఈ అంశంపై ప్రధానమంత్రి ప్రకటన చేయాలన్న విపక్షాల డిమాండ్‌కు ప్రభుత్వం ఒప్పకోకపోవడం లేదని తెలిపింది. ప్రధాని ముఖం చాటేస్తున్నారని ఆరోపించింది.
మణిపూర్ అంశంపై పార్లమెంటు సభాకార్యక్రమాలు మూడవ పనిదినమైన సోమవారంనాడు కూడా ఎలాంటి సభాకార్యక్రమాలు లేకుండా వాయిదా పడింది. ఇటు అధికార పక్షం, అటు విపక్షం పట్టువిడుపులు లేని ధోరణి ప్రదర్శిస్తుండటంతో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా లోక్‌సభలో కీలక ప్రకటన చేశారు. మణిపూర్‌లో అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు.
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో మణిపూర్ అంశం అట్టుడికిస్తోంది. అటు అధికార పక్షం, ఇటు విపక్షాల పట్టువిడుపులు లేని వైఖరి ప్రదర్శిస్తుండటం, పార్లమెంటు వెలుపల నిరనసలకు దిగుతుండటంతో ఉభయసభలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్‌పై సోమవారం సస్పెన్షన్ వేటు పడింది.
పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. విపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు వాయిదా పడటం గమనార్హం. మణిపూర్ అంశంపై చర్చకు విపక్షాల పట్టుబట్టాయి. మణిపూర్ అంశంపై ప్రధాని ప్రకటన చేయాలని డిమాండ్ చేశాయి.
మణిపూర్ అంశంపై పార్లమెంట్లో జరిపే చర్చలో ప్రతిపక్షాలు పాల్గొనాలని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చేతులు జోడించి వేడుకున్నారు. మణిపూర్ అంశంపై పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ ఆయన ప్రతిపక్షాలకు ఈ విజ్ఞప్తి చేశారు. ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై రాజకీయం చేయొద్దని ఠాకూర్ ప్రతిపక్షాలను కోరారు.
మణిపూర్‌లో పరిస్థితిని బిహార్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని పరిస్థితులతో పోల్చుతున్న బీజేపీపై కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం (P Chidambaram) ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్‌లో ప్రభుత్వం కుప్పకూలిందని, కేంద్ర ప్రభుత్వం స్వయంగా విధించుకున్న కోమాలో ఉందని దుయ్యబట్టారు.