Manipur issue: రూల్ 267 కింద చర్చ ఎందుకు జరపడం లేదో చెప్పిన కేంద్ర మంత్రి

ABN , First Publish Date - 2023-07-28T18:20:46+05:30 IST

మణిపూర్ అంశంపై పార్లమెంటు ప్రతిష్ఠంభనకు కారణమవుతున్న రూల్‌ 267పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తొలిసారి వివరణ ఇచ్చారు. ఏ సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని, కానీ విపక్ష పార్టీలు రూల్ 267 కింద చర్చజరపాలని పట్టుబట్టడం సరికాదని అన్నారు.

Manipur issue: రూల్ 267 కింద చర్చ ఎందుకు జరపడం లేదో చెప్పిన కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ: మణిపూర్ (Manipur) అంశంపై పార్లమెంటు ప్రతిష్ఠంభనకు కారణమవుతున్న రూల్‌ 267 (Rule 267)పై కేంద్ర మంత్రి, రాజ్యసభలో బీజేపీ పక్ష నేత పీయూష్ గోయల్ (Piyush Goyal) తొలిసారి వివరణ ఇచ్చారు. ఏ సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని, కానీ విపక్ష పార్టీలు రూల్ 267 కింద చర్చజరపాలని పట్టుబట్టడం సరికాదని అన్నారు.


మణిపూర్ హింసపై చర్చ విషయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య ఏడు రోజులుగా ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. రూల్ 267 కింద సభాకార్యక్రమాలన్నీ రద్దు చేసి చర్చ జరపాలని ప్రతిపక్షాలు పట్టుపడుతుండగా, అధికార పార్టీ మాత్రం నిరాకరిస్తోంది. స్వల్పకాలిక చర్చకు సిద్ధమని పదేపదే చెబుతోంది. ఈ నేపథ్యంలో రూల్ 267 నిబంధన కింద ఎందుకు చర్చను ప్రభుత్వం ఎందుకు కాదంటోందో కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ శనివారంనాడు వివరణ ఇచ్చారు.


''మణిపూర్ అంశంపై సరైన పద్ధతిలో చర్చ జరపాలని మరోసారి విపక్షాలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏ సమస్యకైనా చర్చలే పరిష్కారం. పార్లమెంటులో చర్చకు మేము అంగీకరించాం. అయితే విపక్షాలు మాత్రం రూల్ 267 రూల్ కిందనే చర్చ జరపాలని ఆ తర్వాత పట్టుబట్టాయి. మరొక మార్గం లేనప్పుడు మాత్రమే ఈ రూల్ వర్తింపజేయాలి. కానీ, ఈరోజుతో ఏడు రోజుల సభాసమయం గడిచిపోయింది. అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే రూల్ 267 అమలు చేయాల్సి ఉంటుంది'' అని కేంద్ర మంత్రి చెప్పారు.


రూల్ 267 అంటే..?

ఈ రూల్ కింద చర్చ జరపాలంటే, సభాపతి అనుమతిపై ఆరోజు నిర్దేశించిన సభా కార్యక్రమాలన్నీ రద్దు చేసి అత్యవసరంగా చర్చ మొదలుపెట్టాలి.


ఉభయ సభలు వాయిదా

మణిపూర్ అంశంపై అధికార, ప్రతిపక్ష సభ్యులు పట్టువిడుపులు లేని ధోరణ ప్రదర్శించడంతో వరుసగా ఏడోరోజు కూడా పార్లమెంటు సమావేశాలు వాయిదా పడ్డాయి. రాజ్యసభలో చైర్మన్ జగ్దీప్ ధన్‌కఢ్, టీఎంసీ నేత డెరిక్ ఒబ్రెయిన్ మధ్య తీవ్ర వాగ్యుద్ధం చోటుచేసుకుంది. మణిపూర్ అంశంపై రూల్ 267 కింద విపక్షాలు ఇచ్చిన నోటీసును ధన్‌కఢ్ తోసిపుచ్చడంతో టీఎంసీ ఎంపీ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వీరిమధ్య వాదన చోటుచేసుకుంది. దీంతో సభను శనివారంనాటికి చైర్మన్ వాయిదా వేశారు. అటు, లోక్‌సభలోనూ మణిపూర్ అంశంపై విపక్ష నేతలు ఆందోళన కొనసాగించడంతో సభ ప్రారంభమైన రెండు నిమిషాలకే వాయిదాపడింది.

The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-07-28T18:20:46+05:30 IST