Home » Manipur
మణిపూర్‌లో పరిస్థితి రాన్రానూ ఉద్రిక్తంగా మారుతుండటంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)పై సొంత పార్టీలోనే అసంతృప్తి పెరుగుతోంది. మోదీ నిజమైన సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర సమస్యల గురించి చెప్పడానికి అవకాశం లభించడం లేదని ఆగ్రహం వ్యక్తమవుతోంది.
మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో వైరల్ అవడంతో మిజోరాంలోని ఓ సంఘం రాసిన లేఖ మెయిటీలను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. మహిళలపై జరిగిన దారుణంపై మిజో యువత తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, స్వీయ రక్షణ కోసం మెయిటీలు మిజోరాం నుంచి వెళ్లిపోవాలని ఈ లేఖలో హెచ్చరించారు.
మణిపూర్‌లో మే 3 నుంచి జరుగుతున్న హింసాకాండపై ‘ఉక్కు మహిళ’ ఇరోమ్ షర్మిల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని చక్కదిద్దాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)కి విజ్ఞప్తి చేశారు. యువతపై మద్యం విపరీత ప్రభావం చూపుతోందని, గృహహింసకు దీనికి సంబంధం ఉందని తెలిపారు.
మణిపూర్‌లో రెండు నెలలకు పైగా కొనసాగుతున్న హింసాకాండను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాన్ని శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం ఎండగట్టింది. 'మణిపూర్ ఫైల్స్' పేరుతో ఒక సినిమా తీయాలని సూచించింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ)పై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విమర్శలు గుప్పించారు. హింసాకాండతో అట్టుడుకుతున్న మణిపూర్ లో పర్యటించేందుకు ప్రధాని ఎందుకు దూరంగా ఉంటున్నారని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల కోసం కర్ణాటక, రాజస్థాన్, ఇతర ప్రాంతాల్లో పర్యటనలు జరిపిన మోదీ మణిపూర్‌కు మాత్రం వెళ్లడం లేదని నిలదీశారు. ఇలాంటి ప్రధానిని చూడటం తనకు ఇదే మొదటిసారని అన్నారు.
మహిళలను అవమానించే సంఘటనలు తరచూ జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మణిపూర్‌లో వివిధ వర్గాల మధ్య ఘర్షణల నేపథ్యంలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన దారుణం బయటపడిన కొద్ది రోజులకు పశ్చిమ బెంగాల్లో అటువంటి దుశ్చర్య బయటపడింది. దొంగతనానికి పాల్పడ్డారనే నెపంతో ఇద్దరు మహిళలను అర్ధనగ్నంగా చేసి, కొందరు మహిళా వ్యాపారులు కొట్టినట్లు తెలుస్తోంది.
మణిపూర్‌లో మరో దారుణం. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, వారిపై అత్యాచారానికి పాల్పడిన ఉదంతం దుమారం రేపుతుండగానే.. ఓ యువకుడి తల నరికి వెదురు తడికెకు వేలాడదీసిన ఘటన వెలుగులోకి వచ్చింది. హతుడు కుకీ తెగకు
మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన పార్లమెంటును సైతం కుదిపేయడంతో శాంతి భద్రతల వైఫల్యానికి బాధ్యత వహిస్తూ సీఎం ఎన్.బైరేన్ సింగ్ రాజీనామా చేయాలనే డిమాండ్లు మరోసారి ఊపందుకున్నాయి. అయితే, రాష్ట్రంలో శాంతిభద్రతలు పునరుద్ధరించడమే తన పని అని, బాధ్యులైన వారిపై కఠిన చర్చలు తీసుకుంటామని సీఎం చెప్పారు.
మణిపూర్‌లో సభ్యసమాజం తల వంచుకునేలా ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరించిన ఘటనపై నిరసనలు పెల్లుబుకుతుండగా, ఈ ఘటనపై ప్రధానమంత్రి మోదీని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నిలదీశారు. ఈ ఘటన మీ హృదయాన్ని కొంచెమైనా బాధించలేదా అని ప్రశ్నించారు.
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో రెండో రోజు కూడా మణిపూర్ పరిస్థితిపై ప్రతిపక్షాల నినాదాలతో దద్దరిల్లింది. మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనతోపాటు, మే 3 నుంచి కొనసాగుతున్న హింసాకాండ గురించి చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి.