Home » Manipur
మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనకు కారణం వదంతులేనని మణిపూర్ పోలీసు వర్గాలు తెలిపాయి.
పట్టపగలు కుకీ తెగకు చెందిన ముగ్గురు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించి, సామూహిక అత్యాచారానికి పాల్పడిన అమానుష ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బిరెన్ సింగ్ (Biren singh) స్పందించారు. అవనుషమైన ఈ ఘటనతో సంబంధమున్న మరో వ్యక్తిని పోలీసులు సాయంత్రం అరెస్ట్ చేశామని ప్రకటించారు. వీడియో చూసిన తర్వాత ఈ హేయమైన నేరాన్ని ఖండించాలని నిర్ణయించామని అన్నారు. మానవత్వంపై జరిగిన నేరంగా అభివర్ణించారు.
మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి గ్యాంగ్ రేప్ చేసిన ఘటనపై దేశవ్యాప్తంగా విమర్శల వర్షం కురుస్తోంది. ఈ అంశంపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా స్పందించారు. ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని సోషల్ మీడియా ద్వారా ఆవేదన చెందారు. ఈ మేరకు ఆమె ఓ నోట్‌ను పోస్ట్ చేశారు.
పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి రోజైన గురువారం మణిపూర్ హింసాకాండ, అమానవీయ ఘటనలపై నిరసనలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించినట్లు కనిపిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడంతో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
రెండున్నర నెలల నుంచి హింసాత్మక సంఘటనలు జరుగుతున్న మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన దారుణ సంఘటనపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన, బాధ వ్యక్తం చేశారు. ఈ సంఘటనలో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ ప్రకటించారు.
మణిపూర్‌లో ఇద్దరు మహిళలను దారుణంగా, నగ్నంగా ఊరేగించిన సంఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం ఘాటుగా స్పందించారు. ఈ అమానుష సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, బాధించిందని చెప్పారు. ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటుకు రావడానికి ముందు తన మనసు బాధ, ఆగ్రహంతో నిండిపోయాయని చెప్పారు.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ సమావేశాల్లో దాదాపు 30 బిల్లులను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే హింసాత్మక సంఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్ పరిస్థితిపై చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
మణిపూర్‌లో మెయిటీ, కుకీ జాతుల మధ్య హింసాత్మక సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించినట్లు కనిపిస్తున్న ఓ వీడియో ట్విటర్లో వైరల్ అవుతోంది. ఈ సంఘటనపై దర్యాప్తు జరుగుతున్నందువల్ల ఈ వీడియోను తొలగించాలని ట్విటర్, ఇతర సామాజిక మాధ్యమాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
మణిపూర్‌లో కుకీ స్త్రీలను నగ్నంగా ఊరిగించి అత్యాచారం, హత్యపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
మణిపూర్‌లో హింసాత్మక సంఘటనలను అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra) ఆరోపించారు. ఆ రాష్ట్రంలో అంతర్యుద్ధం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించినట్లు ఓ పాత వీడియో బయటపడిన నేపథ్యంలో ఆమె స్పందిస్తూ, భారత్‌ను బీజేపీ ఇలా దిగజార్చిందని వ్యాఖ్యానించారు.