Share News

Manoharlal Khattar: నెహ్రూ యాదృచ్ఛిక ప్రధాని.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Jan 12 , 2025 | 09:36 PM

నెహ్రూ యాదృచ్ఛికంగా ప్రధాని అయ్యారని, ఆ పదవికి సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అర్హులని కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టార్ వ్యాఖ్యానించారు

Manoharlal Khattar: నెహ్రూ యాదృచ్ఛిక ప్రధాని.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: దేశ తొలి ప్రధాని పండిట్ జహవర్‌లాల్ నెహ్రూ (Jawaharlal Nehru)పై కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ (Manoharlal Khattar) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనను 'యాక్సిడెంటల్ పీఎం'గా అభివర్ణించారు. నెహ్రూ యాదృచ్ఛికంగా ప్రధాని అయ్యారని, ఆ పదవికి సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అర్హులని వ్యాఖ్యానించారు. హర్యానా రాష్ట్రం రోహ్‌తక్‌లోని మహర్షి దయానంద్ యూనివర్శిటీలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Tamilnadu: ఈరోడ్ ఈస్ట్ ఉపఎన్నికను బాయ్‌కాట్ చేసిన ఎన్డీయే


మీరూ అంతే..

కాగా, భారతదేశ తొలి ప్రధాని నెహ్రూను 'యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్‌'గా ఖట్టార్ పేర్కొనడంపై కాంగ్రెస్ పార్టీ సీరియస్‌ అయింది. మనోహర్ లాల్ కట్టార్ సైతం హర్యానాకు యాక్సిడెంటల్ ముఖ్యమంత్రి అని, అందువల్లే ఈ తరహాలో మాట్లాడుతున్నారని హర్యానా కాంగ్రెస్ నేత భూపిందర్ సింగ్ హుడా ప్రతివిమర్శ చేశారు.


బీజేపీ నేతలు నెహ్రూను విమర్శించడం ఇదే మొదటసారి కాదు. గత నెలలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు బీజేపీ నేతలు నెహ్రూపై విమర్శలు గుప్పించారు. భారత రాజ్యాంగం డ్రాఫ్టింగ్ కమిటీలో అంబేడ్కర్‌ను చేర్చడం నెహ్రూకు ససేమిరా ఇష్టం లేదని యోగి విమర్శించారు. అంబేడ్కర్ ఉన్నప్పుడే కాకుండా మరణాంతరం కూడా ఆయన లెగసీని బలహీనపరచేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందన్నారు.


ఇవి కూడా చదవండి..

Hero Vijay: హీరో విజయ్ అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

Chief Minister: నాన్న అనే ఆ పిలుపే మా పాలనకు కితాబు

Read Latest National News and Telugu News

Updated Date - Jan 12 , 2025 | 09:38 PM