Home » Medak
అక్రమంగా ఇసుకను తరలిస్తూ పట్టుబడిన టిప్పర్ను విడుదల చేసేందుకు లంచం తీసుకొని హావేళీ ఘనపూర్ ఎస్ఐతో పాటు మధ్యవర్తిగా వ్యవహరించిన ఓ జర్నలిస్టు సోమవారం ఏసీబీకి చిక్కారు.
జీవితాన్ని మెదక్(Medak) పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకే అంకితం చేస్తానని ఎంపీ రఘునందన్ రావు(MP Raghunandan Rao) చెప్పారు. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లా కేంద్రాల్లో ఎంపీ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కృతజ్ఞత సభలో ఎంపీ పాల్గొన్నారు. అనంతరం తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికలపై రఘునందర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఏసీబీ వలకి మరో అవినీతి అధికారి చిక్కారు. రూ.20వేలు లంచం తీసుకుంటూ హావేలి ఘన్పూర్ ఎస్సై రెండ్ హ్యాండెడ్గా ఏసీబీ వలకి చిక్కారు. గత నెల 26న అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ను స్పెషల్ పార్టీ పోలీసులు సీజ్ చేశారు.
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం అర్కెలలో జూనియర్ లైన్మెన్ నిర్లక్ష్యానికి ఓ యువకుడు బలయ్యాడు.
సమాజంలో రోజురోజుకు మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. చిన్న, పెద్ద, ముసలి, ముతక అని లేడా లేకుండా మహిళలపై నిరంతరం అత్యాచారాలు, హత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక ఘటన మరవక ముందే మరో ఘటన వెలుగులోకి వస్తూ ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆడపిల్లలు పుట్టారంటేనే నిరంతరం కాపాడుకోవాల్సిన పరిస్థితి దాపురించింది.
కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ పాఠశాలలు, శిశు మందిరాలను ఛిన్నాభిన్నం చేశాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) అన్నారు. సంస్కృతీ, సంప్రదాయాలకు శిశుమందిర్ పాఠశాలలు(Shishumandir Schools) నిలయాలని కేంద్ర మంత్రి కొనియాడారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ (Husnabad) సరస్వతీ శిశుమందిర్ పాఠశాల నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు.
రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతిచెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం బైపా్సరోడ్డు వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం సంభవించింది. మధ్యప్రదేశ్లోని రేవా జిల్లా గృహ, బుర్హా, గుడువా గ్రామాలకు చెందిన మేకల వ్యాపారులు, కూలీలు..
గత కేసీఆర్ హయాంలోని మంత్రులకు ఏ మాత్రం స్వేచ్ఛ లేకపోయిందని, ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్న పెద్దాయన అనుమతిస్తే తప్ప సంతకం పెట్టే అవకాశం ఉండేది కాదని మంత్రి కొండా సురేఖ అన్నారు.
బీఆర్ఎస్ నేతల మాటలు విని ఫోన్ ట్యాపింగ్లో పట్టుబడ్డ కొందరు పోలీసులు జైల్లో ఉన్నారని .. తప్పుడు పనులు చేసిన పోలీసులను కూడా అక్కడికే పంపుతామని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు (Raghundan Rao) హెచ్చరించారు.
ఆన్లైన్ బెట్టింగ్ ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఈ ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం ధర్మారం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన దొమ్మాట భాను(24) డిగ్రీ పూర్తి చేసి డ్రైవర్గా పనిచేస్తున్నాడు.