Share News

Hyderabad: హరీశ్‌.. దమ్ముంటే రాజీనామా చెయ్‌

ABN , Publish Date - Aug 17 , 2024 | 04:48 AM

‘రుణమాఫీ అయిపోయె.. నీ రాజీనామా ఏడబోయె.. రాజీనామాకు భయపడి బాలిలో మకాం వేశావు.. హరీశ్‌రావు..

Hyderabad: హరీశ్‌.. దమ్ముంటే రాజీనామా చెయ్‌

  • హైదరాబాద్‌లో మైనంపల్లి అభిమానుల పేరిట ఫ్లెక్సీలు

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): ‘రుణమాఫీ అయిపోయె.. నీ రాజీనామా ఏడబోయె.. రాజీనామాకు భయపడి బాలిలో మకాం వేశావు.. హరీశ్‌రావు.. దమ్ముంటే రాజీనామా చెయ్‌’ అని పేర్కొంటూ మైనంపల్లి అభిమానుల పేరిట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు హైదరాబాద్‌లో కలకలం రేపాయి. సికిందరాబాద్‌, బేగంపేట, ప్యాట్నీ, ప్యారడైజ్‌, రసూల్‌పురా ప్రాంతాల్లో ఈ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి.


అదేవిధంగా పలు చోట్ల బస్టా్‌పలకు ఫ్లెక్సీలు.. కరీంనగర్‌ వైపు వెళ్లే రాజీవ్‌ రహదారి మార్గంలో హోర్డింగ్‌లు పెట్టారు. రేవంత్‌ ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల రుణమాఫీ చేశారని.. సవాల్‌కు కట్టుబడి హరీశ్‌ రాజీనామా చేయాలని అందులో డిమాండ్‌ చేశారు. ఈ ఫ్లెక్సీల ఏర్పాటు వెనక హన్మంతరావు ప్రమేయమున్నదా.? లేక ఈ ఆలోచన మెదక్‌ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌దా..? అన్న చర్చ జరుగుతోంది.

Updated Date - Aug 17 , 2024 | 04:48 AM