Home » Medaram Jathara
ఆదివాసీల ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది. సమ్మక్క సారాలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించలేమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధాని మోదీ తరఫున సమ్మక్క సారలమ్మకు గురువారం నాడు కిషన్ రెడ్డి మొక్కులు చెల్లించారు.
Telangana: మేడారం సమక్క - సారలమ్మ మహా జాతర కీలక ఘట్టానికి చేరిందని మంత్రి సీతక్క తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కోయ పూజారులు ఉపవాసం ఉండి పూజా కార్యక్రమాలు చేస్తారని తెలిపారు. సాయంత్రం 5 గంటల నుంచి చిలకలగుట్టలో పూజలు ప్రారంభమవుతాయన్నారు.
Telangana: మేడారం జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. భక్తులు వేయికళ్లతో ఎదురుచూస్తున్న తరుణం ఆసన్నమైంది. మేడారంలో సమ్మక్క ఆగమన పూజలు ప్రారంభమయ్యాయి. గద్దెపై కంకవణాన్ని కోయపూజారులు ప్రతిష్టించారు.
Telangana: దేశంలోనే రెండవ అతిపెద్ద జాతర, తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమక్క-సారక్క జాతర భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. రెండేళ్లకు ఒకసారి జరిగిన ఈ జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి భక్తులు విచ్చేస్తుండటంతో మేడరం భక్తజనసంద్రంగా మారింది.
Sammakka Saralamma Jatara 2024 Live Updates: ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం మహా జాతరకు దేశ వ్యాప్తంగా భక్తులు పోటెత్తారు. లక్షలాది మంది అమ్మవార్ల గద్దెలను దర్శించుకుంటున్నారు.
Telangana: మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని మంత్రి సీతక్క తెలిపారు. బుధవారం ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. ఎద్దుల బండ్ల నుంచి హెలికాప్టర్ వినియోగించే వరకు జాతర తీరు మారిందన్నారు. సమ్మక్క, సారలమ్మ పూజలు రహస్యంగా జరుగుతాయన్నారు.
Telangana: తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమక్క-సారక్కా జాతర ఈరోజు నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. మేడారం జాతరకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఈ విషయంపై టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. మేడారం జాతరకు ఆర్టీసీ 6000 ప్రత్యేక బస్సులు నడుపుతోందన్నారు.
రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ వన జాతరకు ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ మొదటిసారి అధికారం చేపట్టడం, అనంతరం ఈ జాతర జరగుతుండటంతో రేవంత్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఎఫెక్ట్ రైల్వే, బస్సుల్లో ప్రయాణించే రెగ్యులర్ ప్యాసింజర్స్ పై కనిపిస్తోంది. మహాజాతరకు నగరం నుంచి సిటీ బస్సులను తరలించడంతో సిటీ ట్రావెలర్స్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మేడారం మహా జాతరకు వెళ్లాలనుకుంటున్నారా? రోడ్డు, రైలు మార్గాల ద్వారా ట్రాఫిక్, రద్దీని తట్టుకొని గంటలకొద్దీ ప్రయాణం అని జంకుతున్నారా?