Home » Medical News
ఎన్‌హెచ్ 65.. తెలుగు రాష్ట్రాల్లోని రెండు ప్రధాన నగరాలైన హైదరాబాద్‌ను, విజయవాడను కలిపే అత్యంత కీలకమార్గం! తెలంగాణలోని 23 జాతీయ రహదారుల్లో.. అతి ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగే హైవేల్లో మొదటిది కూడా ఇదేనని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
దాదాపు రెండేళ్ల పాటు గవర్నర్ కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్న పలు కీలక బిల్లులకు తెలంగాణ ఇన్చార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆమోదం తెలిపారు.
వైద్య విద్య సంచాలక కార్యాలయం (డీఎంఈ) పరిఽధిలోని పదోన్నతుల వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. వైద్యారోగ్యశాఖ ఉన్నతాఽధికారుల తీరుపై సీనియర్ ఆచార్యులు, అధ్యాపకులు అభ్యంతరం తెలుపుతున్నారు.
బదిలీలను అడ్డుకునేందుకు తనపై ప్రభుత్వ వైద్యుల సంఘానికి చెందిన ముగ్గురు వైద్యులు దాడికి పాల్పడ్డారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కోఠీలోని డీఎంఈ కార్యాలయం ప్రవేశ ద్వారం వద్ద శేఖర్ అనే డాక్టర్ ధర్నా నిర్వహించారు.
నీట్ యూజీ పరీక్షను రద్దు చేయొద్దని.. అలా చేస్తే నిజాయితీగా పరీక్ష రాసిన లక్షలాది విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది.
హైదరాబాద్‌లో నిర్మితమవుతున్న నాలుగు టిమ్స్(తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఆస్పత్రుల ఎత్తును 14 అంతస్తులకే పరిమితం చేశామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.
తెలంగాణలోని పది జిల్లాల్లో గర్భస్రావాల (అబార్షన్లు) శాతం అధికంగా ఉంది. ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు అన్ని జిల్లాల్లో నమోదైన గర్భిణుల్లో 10 శాతం మందికి అబార్షన్లు అయినట్లు తేలింది. ఈ విషయాన్ని తాజాగా వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి నివేదించింది. ఈ ఐదు నెలల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 2,84,208 మంది గర్భిణులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
వరంగల్‌లో 300 పడకలతో ఏర్పాటు చేసిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ప్రపంచ స్థాయి వైద్య సదుపాయాలు కల్పిస్తున్నట్లు మెడికవర్ ఆలిండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనిల్‌కృష్ణ తెలిపారు. ఈ ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్లతోపాటు ఎక్కువ సంఖ్యలో ఐసీయూ బెడ్స్ ఉన్నాయని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రాన్ని మెడికల్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందిందని, విద్య, వైద్యం, విద్యుత్తు నిరంతరం ఉండటంతోపాటు ఫార్మా, ఐటీ, టూరిజం, విద్యాసంస్థలు నగరాన్ని ఆ స్థాయిలో నిలిపాయని తెలిపారు.
ఆస్పత్రి మార్చురీ పరిసరాల పేరు చేబితేనే వామ్మో అంటాం. మృతదేహాలు, సంబంధిత బంధువుల రోదనలతో అక్కడి పరిస్థితి ఒళ్లు జలదరింపజేస్తుంది.