Home » Mizoram
మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కీలక హామీనిచ్చింది. కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి రాగానే గిరిజన భూములు, అటవీ ప్రాంతాలు, గిరిజన హక్కుల పరిరక్షణ కోసం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదిస్తామని హామీ ఇచ్చింది.
మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు దాఖలైన 174 నామినేషన్లను పరిశీలించిన ఎన్నికల కమిషన్ 173 నామినేషన్లు చెల్లుబాటును ధ్రువీకరించింది. విపక్ష పార్టీ జేపీఎం అభ్యర్థి డాక్టర్ లొర్రయిన్ లాల్‌పెక్లియాన్ నామినేషన్‌లో కొన్ని తేడాలు కనిపించినందున పునఃపరిశీలన చేస్తున్నట్టు కమిషన్ అధికారులు తెలిపారు.
ఎన్నికలు చిన్నవైనా పెద్దవైనా తమ పోటీ ఎప్పుడూ ఒకేలా ఉంటుందని చెప్పే బీజేపీ ఈసారి మిజోరం అసెంబ్లీ ఎన్నికలను కూడా సీరియస్‌గానే తీసుకుంది. 40 మంది అసెంబ్లీ స్థానాలున్న మిజోరంలో ఎన్నికల స్టార్ క్యాంపెయినర్లుగా 40 మందిని శుక్రవారంనాడు ప్రకటించింది.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మిజోరంలో రెండో రోజు పర్యటిస్తున్న కాంగ్రెస్ వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ మంగళవారంనాడు ఒక స్కూటీపై ఐజ్వాల్ క్లబ్‌కు వెళ్లారు. అక్కడ పార్టీ నేతలతో సమావేశమయ్యేందుకు బయలుదేరిన రాహుల్ ఒక స్కూటర్ వెనకాల హెల్మెట్ ధరించి కూర్చుని ప్రయణం సాగించారు.
మిజోరం అసెంబ్లీలో ఎన్నికల్లో పోటీ చేసే 39 మంది అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ సోమవారంనాడు విడుదల చేసింది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు లాల్‌సవతా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మిజోరంలో రాహుల్ గాంధీ పర్యటన వేళ రాష్ట్ర కాంగ్రెస్ ఈ జాబితాను విడుదల చేసింది.
మిజోరాం అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ మిజో నేషనల్ ఫ్రంట్ తిరిగి అధికారంలోకి వస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జోరంతంగా ధీమా వ్యక్తం చేశారు. మొత్తం 40 అసెంబ్లీ స్థానాల్లో తమ పార్టీ 25 నుంచి 35 సీట్లు గెలుచుకుంటుందని చెప్పారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ని ఎన్నికల సంఘం విడుదల చేసినప్పటి నుంచి.. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి. ఈసారి ఎలాగైనా గెలుపొందాలన్న లక్ష్యంతో.. కీలక పనులన్నీ చకచకా...
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల కమిషన్ సోమవారంనాడు ప్రకటించడంతో అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. ఛత్తీస్‌గఢ్, మిజోరంలో ఓటరు నాడిపై ఏబీపీ-సీఓటర్ సర్వే ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. ఛత్తీస్‌గఢ్ లో అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీ మధ్య నువ్వానేనా అనే రీతిలో పోరు ఉండనుందని, మిజోరంలో హంగ్‌కు అవకాశాలున్నాయని సర్వే అంచనా వేసింది.
మిజోరంలోని ఐజ్వాల్‌లో నిర్మాణంలో ఉన్న ఒక రైల్వే బ్రిడ్జి కుప్పకూలడంతో 17 మంది కార్మికులు దుర్మరణం పాలయ్యారు. ఐజ్వాల్‌కు 20 కిలోమీటర్ల దూరంలోని సాయిరంగ్ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు బుధవారం ఉదయం తెలిపారు.
ఐదు రాష్ట్రాల శాసన సభలకు త్వరలో జరిగే ఎన్నికలకు వ్యూహ రచనను బీజేపీ ముందస్తుగానే ప్రారంభించింది. ఆ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బుధవారం సాయంత్రం సమావేశం కాబోతోంది.