Home » MLA Seethakka
అమలు కాని పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి కేసీఆర్ మోసగించే ప్రయత్నం చేస్తున్నారని ఏఐసీసీ మహిళా
సభలో స్పీకర్ మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడానికి నిరసనగా కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అసెంబ్లీ సమావేశాలను బాయ్‌కాట్ చేశారు. అసెంబ్లీలో ఏం జరుగుతుందో అర్థంకావడంలేదని వ్యాఖ్యానించారు. సభలోకి వచ్చిన తర్వాత కూడా బిజినెస్ గురించి చెప్పడం లేదని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆమె మండిపడ్డారు.
హైదరాబాద్: భారత్ జోడోయాత్రతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి వచ్చిన ప్రజాదరణ చూసి మోదీ సర్కార్ జీర్ణించుకోలేక పోయిందని ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తీవ్రస్థాయిలో విమర్శించారు.
శుక్రవారం అసెంబ్లీలో వరదలపై చర్చ జరపాలని ముఖ్యమంత్రిని కోరుతున్నాం. మోరంచపల్లి, వరంగల్ వరకు వస్తున్న మంత్రులు ములుగు నియోజకవర్గానికి ఎందుకు రావడం లేదు?, గవర్నర్, ముఖ్యమంత్రి మా ప్రాంతాల్లో పర్యటించాలి.
ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తే చాలు.. జనాన్ని పట్టించుకోని నాయకులను చూశాం. జనం బాధల్లో ఉంటే అలా వచ్చి వెళ్లిపోయే నాయకులు తెలుసు. కానీ జనం బాధను తన బాధగా, ప్రజల దుఖాన్ని తన కన్నీటిగా భావించే నాయకులు చాలా అరుదు. అలాంటి అరుదైన నాయకురాలు ఎమ్మెల్యే సీతక్క. కరోనా కఠిన పరిస్థితులైనా.. వరదలైనా.. నా జనం వెంటే నేను అని ఎమ్మెల్యే సీతక్క మరోసారి నిరూపించారు.
ములుగు జిల్లా: ములుగు మండలం, మల్లంపల్లిలో గ్రామపంచాయతీ కార్మికుల సమ్మెకు ఎమ్మెల్యే సీతక్క మద్దతు తెలిపారు. రోడ్లు ఊడ్చి వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
మణిపూర్‌లో జరిగిన అమానవీయ ఘటనకు నిరసనగా ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో ములుగు జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై ధర్నా , రాస్తారోకో నిర్వహించారు.
హైదరాబాద్: మణిపూర్‌లో దారుణం జరుగుతోందని, 79 రోజుల తర్వాత ప్రధాని మోదీ మాట్లాడడం బాధాకరమని, ఆయనకు ఏం తెలియనట్లుగా చెబుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు.
ములుగు మండలం జగ్గన్నపేట గ్రామానికి చెందిన ధనసరి సమ్మయ్య-సమ్మక్క గురువారం పోడు పట్టాను స్వీకరించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో తండ్రి సమ్మయ్యకు ఎకరం 17గంటల భూమి పట్టాపాస్ పుస్తకాన్ని అందుకున్నారు. దీంతో ఆ దంపతులు ముఖాల్లో చిరునవ్వులు విరిశాయి. సర్పంచ్ అయితేనే కోట్లలో సంపాదన, ఎడాపెడా భూఆక్రమణలకు పాల్పడుతున్న ఈ రోజుల్లో సీతక్క ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆమె తల్లిదండ్రులు అందరిలానే భూ పట్టా పొందడం శెభాష్ అనిపించుకుంటోంది.
అవును.. తెలంగాణలో కాంగ్రెస్ (TS Congress) అధికారంలోకి వస్తే సీతక్కే (Seethakka) సీఎం.. ఆ సందర్భం వస్తే చేయవచ్చు కూడా.. మల్లిఖార్జున ఖర్గేను (Mallikarjuna Kharge) అధ్యక్షుడ్ని చేసింది కాంగ్రెస్సే.. పేదలు, దళితులు, ఆదివాసీలకు కాంగ్రెస్‌లోనే విస్తృత అవకాశాలున్నాయ్.. ఇవీ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) చేసిన వ్యాఖ్యలు...