MLA Seetakka: మోదీ, అమిత్ షాలు కలిసి రాహుల్‌పై కుట్ర..

ABN , First Publish Date - 2023-08-04T16:08:25+05:30 IST

హైదరాబాద్: భారత్ జోడోయాత్రతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీకి వచ్చిన ప్రజాదరణ చూసి మోదీ సర్కార్ జీర్ణించుకోలేక పోయిందని ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తీవ్రస్థాయిలో విమర్శించారు.

MLA Seetakka: మోదీ, అమిత్ షాలు కలిసి రాహుల్‌పై కుట్ర..

హైదరాబాద్: భారత్ జోడోయాత్ర (Bharat Jodoyatra)తో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)కి వచ్చిన ప్రజాదరణ చూసి మోదీ సర్కార్ (Modi Govt.) జీర్ణించుకోలేక పోయిందని ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క (MLA Seetakka) తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ సందర్బంగా శుక్రవారం ఆమె హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా (Amit Shah)లు కలిసి రాహుల్‌పై కుట్ర చేశారని ఆరోపించారు. పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు వేసి.. ఇల్లు ఖాళీ చేయించారని మండిపడ్డారు. సూరత్ (Surat), గుజరాత్ కోర్టు (Gujarat Court)లు ఇచ్చిన తీర్పులతో న్యాయ వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లింది.. కానీ సుప్రీం కోర్టు (Supreme Court) తీర్పుతో నమ్మకం వచ్చిందని సీతక్క వ్యాఖ్యానించారు.

మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య (Ponnala Lakshmaiah) మాట్లాడుతూ సుప్రీం తీర్పు ఒక చారిత్రక ఘట్టమని అన్నారు. అంతిమంగా సత్యమే గెలుస్తుందని సుప్రీం తీర్పు రుజువు చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి చెంప పెట్టు లాంటి తీర్పు అని అన్నారు. రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నామని సీతక్క వ్యాఖ్యానించారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-08-04T16:08:25+05:30 IST