Congress MLA Seethakka: సీతక్కను టార్గెట్ చేసిన గులాబీ దండు... జనం కోసం తపనపడినా రాజకీయమేనా?
ABN , First Publish Date - 2023-07-29T12:53:01+05:30 IST
ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తే చాలు.. జనాన్ని పట్టించుకోని నాయకులను చూశాం. జనం బాధల్లో ఉంటే అలా వచ్చి వెళ్లిపోయే నాయకులు తెలుసు. కానీ జనం బాధను తన బాధగా, ప్రజల దుఖాన్ని తన కన్నీటిగా భావించే నాయకులు చాలా అరుదు. అలాంటి అరుదైన నాయకురాలు ఎమ్మెల్యే సీతక్క. కరోనా కఠిన పరిస్థితులైనా.. వరదలైనా.. నా జనం వెంటే నేను అని ఎమ్మెల్యే సీతక్క మరోసారి నిరూపించారు.
ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తే చాలు.. జనాన్ని పట్టించుకోని నాయకులను చూశాం. జనం బాధల్లో ఉంటే అలా వచ్చి వెళ్లిపోయే నాయకులు తెలుసు. కానీ జనం బాధను తన బాధగా, ప్రజల దుఖాన్ని తన కన్నీటిగా భావించే నాయకులు చాలా అరుదు. అలాంటి అరుదైన నాయకురాలు ఎమ్మెల్యే సీతక్క. కరోనా కఠిన పరిస్థితులైనా.. వరదలైనా.. నా జనం వెంటే నేను అని ఎమ్మెల్యే సీతక్క మరోసారి నిరూపించారు. ఇటీవలి భారీ వర్షాలకు ములుగు ప్రాంతం భారీగా ఎఫెక్ట్ అయ్యింది. ఎటు చూసినా వరదలే.. కన్నీళ్లే. కట్టుబట్టలతో ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు. అయినా వరద నీటిలో చిక్కుకుపోయిన వారు కూడా ఉన్నారు.
నా జనం వరదలో కొట్టుకపోయారు.. హెలికాప్టర్ కావాలి అని ఉదయం నుండి సీఎంకు, కేటీఆర్ కు, మంత్రులకు ఫోన్ చేసినా.. కండ్ల ముందే కావాల్సిన వారు కొట్టుకపోతుంటే.. అంటూ ఎమ్మెల్యే సీతక్క కన్నీరు పెట్టుకున్నారు. కొట్టుకపోయిన వారు సీతక్క కుటుంబీకులు కాదు. చుట్టాలు అంతకన్నా కాదు. తన నియోజకవర్గం ప్రజలు. అంటే తన ప్రజల కోసం సీతక్క ఎంత తపన పడ్డారో ఇదో ఉదాహరణ మాత్రమే. అంతేకాదు మహిళగా కొట్టుకపోయిన బ్రిడ్జిలు దాటుతూ, కాలినడకన వెళ్తూ, మోకాలి లోతు నీళ్లలోనూ జనాన్ని ఓదార్చుతూ ఎమ్మెల్యే సీతక్క పడ్డ కష్టం అంతా ఇంతా కాదు.
సర్వం కోల్పోయిన జనానికి ధైర్యం చెప్తూ, తోచిన సహాయం చేస్తూ.. అధికారులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే సీతక్క బాధిత ములుగు ప్రజలకు అమ్మగా మారిపోయింది. సోషల్ మీడియాలో సీతక్క తపన వైరల్ అయ్యింది. రాజకీయాలకు అతీతంగా సీతక్కను ఇష్టపడే వాళ్లు ఉన్నప్పటికీ, తిట్టేందుకు రెడీగా ఉండే పెయిడ్ ఆర్టిస్టులుగా కూడా ఉంటారుగా.
అందుకే ఎమ్మెల్యే సీతక్క వీడియోలకు కౌంటర్ గా తాను ఇటీవల అమెరికా వెళ్లిన విమానం ఫోటోలు పెడుతూ.. సీతక్క పేదరికంలోనే ఉంటే స్పెషల్ జెట్ ఎక్కడిది? అంటూ ప్రశ్నించారు. ఆంధ్రజ్యోతి కూడా దీనిపై ఫ్యాక్ట్ చెక్ చేయగా.. అది స్పెషల్ జెట్ కాదని, బిజినెస్ సీట్ అని తేలింది. కాస్త భారమైన తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా 18గంటలకు పైగా ప్రయాణం కాబట్టి ప్రయాణించాల్సి వచ్చిందని తేలింది. అంతేకాదు నిజానికి ఎమ్మెల్యే సీతక్కకు ఇది ఫస్ట్ ఇంటర్నేషనల్ ప్రయాణం కూడా కావటం గమనార్హం.