Home » Mohan Babu
సినీ నటుడు మంచు మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు అయ్యింది. ఓ మీడియా ప్రతినిధిపై దాడి కేసులో రాచకొండ పోలీసులు తనపై నమోదు కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో మోహన్ బాబు పిటిషన్ వేశారు.
మీడియా ప్రతినిధులపై దాడి చేసే ఉద్దేశం తనకు లేదని.. మీడియా ముసుగులో ప్రత్యర్థులు తనపై దాడి చేసే అవకాశముంది కాబట్టే ఆ విధంగా ప్రవర్తించానని నటుడు మోహన్‌బాబు అన్నారు.
సినీ నటుడు మోహన్‌బాబు కుటుంబ వివాదం వ్యక్తిగత అంశమని, ఆయన ఇంటి ప్రాంగణంలో జరిగిన ఘటనలతో శాంతిభద్రతలకు సంబంధం లేదని హైకోర్టు స్పష్టం చేసింది.
తన తండ్రి మోహన్ బాబు చెప్పినందుకే.. ఇంట్లోకి వచ్చిన వారందరినీ బయటికి గెంటేశానని, ఆయన చెప్పిందే తనకు వేదవాక్కు అని నటుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన తండ్రి అనుమతి లేకుండా ఎవరూ ఇంట్లోకి వెళ్లకూడదని చెప్పారు.
మోహన్ బాబు ఎక్కువ యాంగ్జైటీతో ఉన్నారని.. ఈ నేపథ్యంలో ఆయన బాగా కుంగి పోయి ఉన్నారని కాంటినెంటల్ హాస్పటల్ చైర్మన్ తెలిపారు. ఆయన ఎడమ కంటి కింద గాయం ఉందన్నారు. అయితే గుండె పరిసర ప్రాంతమంతా బాగానే ఉందని తెలిపారు. అనారోగ్యంతో గత రాత్రంతా ఆయనకు నిద్ర లేదని చెప్పారు.
మంచు మోహన్ బాబు ఫ్యామిలీ వివాదం మరో కీలక మలుపు తిరిగింది. జల్పల్లి నివాసం నుంచి చిన్న కుమారుడు మంచు మనోజ్‌ను పంపించేందుకు మోహన్ బాబు సిద్ధమయ్యారు. ఇరువురి మధ్య ఘర్షణ నేపథ్యంలో మనోజ్ తన ఇంట్లో ఉండేందుకు కుదరదంటూ ఆయన తేల్చి చెప్పారు.
ఆస్తుల పంపకం విషయమై సినీ నటుడు మోహన్ బాబుతో కుమారుడు మనోజ్ గొడవకు దిగారని, అదే ఇంత పెద్దఎత్తున వివాదానికి దారి తీసిందని వార్తలు హల్ చల్ చేశాయి. కానీ మోహన్ బాబు ఇంటి పని మనిషి ఈ వివాదానికి సంబంధించి సంచలన విషయాలు వెల్లడించింది. ఘర్షణకు ఆస్తి విషయం కాదని ఆమె తేల్చి చెప్పారు.
మంచు కుటుంబంలో ఊహించని మలుపులు.. నిముషానికొక పరిణామం చోటు చేసుకుంటోంది. ఈ వ్యవహారం ఇప్పుడు రచ్చకెక్కింది. తండ్రీ కొడుకులు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం పోలీసులు వారి నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
విష్ణు అనుచరులే సిసి ఫుటేజ్ మొత్తాన్ని మాయం చేశారని, ఇంటిలో ఉన్న సీసీ కెమెరాలు అన్నిటిని విజయ రెడ్డి , కిరణ్ రెడ్డి తీసుకొని వెళ్ళిపోయారని మంచు మనోజ్ ఆరోపించారు. తాను ఆస్తుల కోసం ఎప్పుడూ ప్రాకులాడ లేదని..ఆస్తుల కోసం ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని అన్నారు.
ఫ్యామిలీ గొడవల మధ్య సినీ నటుడు మంచు మనోజ్ నిన్న గాయాలతో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. తన పై తన తండ్రి మోహన్ బాబు దాడికి పాల్పడినట్టుగా మనోజ్ ఆరోపిస్తున్నాడు. మరోవైపు మోహన్ బాబు తాజా సోషల్ మీడియా పోస్టు నెట్టింట వైరలవుతోంది..