Home » Mumbai Indians
ఐపీఎల్ 2024 ఫస్ట్ మ్యాచ్‌ను ముంబై ఇండియన్స్ ఓటమితో ప్రారంభించింది. కొత్త కెప్టెన్ హర్ధిక్ పాండ్యా జట్టు సభ్యులను కమాండ్ చేశాడు. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు కూడా ఆదేశాలు జారీ చేశాడు. రోహిత్ శర్మను వెనక్కి వెళ్లు అని ఆదేశించాడు. హర్ధిక్ అలా చెప్పడంతో రోహిత్ శర్మ కాస్త ఆశ్చర్య పోయాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది.
ఐపీఎల్ 2024లో నిన్న అహ్మదాబాద్(ahmedabad)లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ముంబై ఇండియన్స్(mumbai indians), గుజరాత్ టైటాన్స్(Gujarat titans) మధ్య జరిగిన మ్యాచులో ట్విస్ట్ చోటుచేసుకుంది. తక్కువ పరుగుల(169) లక్ష్యంతో బరిలోకి ముంబై జట్టు అనూహ్యంగా ఓటమి పాలైంది. అయితే గుజరాత్ గెలుపునకు ప్రధాన కారణాలేంటో ఇప్పుడు చుద్దాం.
పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా(3/14) నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడడంతో ముంబై ఇండియన్స్ ముందు గుజరాత్ టైటాన్స్ 169 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని ఉంచింది. బుమ్రాకు తోడుగా గెరాల్డ్ కోయెట్జీ(2/27) కూడా సత్తా చాటాడు. ముఖ్యంగా వీరిద్దరు డెత్ ఓవర్లలో గుజరాత్‌కు పరుగులు రాకుండా కట్టడి చేశారు.
గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. దీంతో అతిథ్య జట్టు గుజరాత్ టైటాన్స్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది.
కెప్టెన్సీ మార్పుతో తీవ్ర నిరాశలో ఉన్న ముంబై ఇండియన్స్ అభిమానులకు గుడ్ న్యూస్. ఇంత కాలం విబేధాలు ఉన్నాయని భావిస్తున్న ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కలిసిపోయారు. ముంబై ఇండియన్స్ ప్రాక్టీస్ సెషన్ వేదికగా ఒకరినొకరు కౌగిలించుకుని, సంభాషించుకున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024కు అంతా సిద్ధమైంది. ఈ శుక్రవారం నుంచే మెగా లీగ్ ప్రారంభంకాబోతుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నైసూపర్ కింగ్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. అన్ని ఫ్రాంచైజీలు టోర్నీ కోసం సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే జట్లన్నీ ప్రాక్టీస్ సెషన్లు ప్రారంభించాయి.
ఐపీఎల్ 2024 ప్రారంభానికి మరో 3 రోజులు మాత్రమే ఉంది. దీంతో ఆటగాళ్లంతా ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టేశారు. ఈ సారి ఎలాగైనా సత్తా చాటాలని జట్లన్నీ భావిస్తున్నాయి. అయితే ఆటగాళ్ల గాయాలు ఫ్రాంచైజీలకు ఇబ్బందిగా మారాయి. ముఖ్యంగా 5 సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఈ సమస్య ఎక్కువగా వేధిస్తోంది.
మరో 3 రోజుల్లో ఇండియన ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) 17వ ఎడిషన్ ప్రారంభంకానుంది. దీంతో జట్లన్నీ పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నాయి. అయితే పలువురు ఆటగాళ్లు గాయాలతో దూరం కావడం ఆయా జట్లను కలవరపెడుతోంది. ముఖ్యంగా 5 సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఈ సమస్య కాస్త ఎక్కువగా వేధిస్తోంది.
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో నేటి నుంచి నాకౌట్ మ్యాచ్‌లు జరగనున్నాయి. శుక్రవారం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది.
రంజీ కప్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో ఎట్టకేలకు మళ్లీ ముంబై జట్టు 42వ సారి టైటిల్ గెల్చుకుంది. ఈ టోర్నీలో చివరి రౌండ్ వరకు విదర్భ ముంబయికి గట్టి పోటీ ఇచ్చినా కూడా గెలవలేక పోయింది.