Share News

IPL 2024: ముంబై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. కలిసి పోయిన రోహిత్-హార్దిక్.. వీడియో ఇదిగో!

ABN , Publish Date - Mar 21 , 2024 | 07:49 AM

కెప్టెన్సీ మార్పుతో తీవ్ర నిరాశలో ఉన్న ముంబై ఇండియన్స్ అభిమానులకు గుడ్ న్యూస్. ఇంత కాలం విబేధాలు ఉన్నాయని భావిస్తున్న ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కలిసిపోయారు. ముంబై ఇండియన్స్ ప్రాక్టీస్ సెషన్ వేదికగా ఒకరినొకరు కౌగిలించుకుని, సంభాషించుకున్నారు.

IPL 2024: ముంబై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. కలిసి పోయిన రోహిత్-హార్దిక్.. వీడియో ఇదిగో!

ముంబై: కెప్టెన్సీ మార్పుతో తీవ్ర నిరాశలో ఉన్న ముంబై ఇండియన్స్ అభిమానులకు గుడ్ న్యూస్. ఇంత కాలం విబేధాలు ఉన్నాయని భావిస్తున్న ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కలిసిపోయారు. ముంబై ఇండియన్స్ ప్రాక్టీస్ సెషన్ వేదికగా ఒకరినొకరు కౌగిలించుకుని, సంభాషించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ యాజమాన్యం తమ ఎక్స్ ఖాతాలో అప్‌లోడ్ చేయగా నెట్టింట వైరల్‌గా మారింది. వీడియోలో కనిపిస్తోన్న దాని ప్రకారం.. ముంబై ఇండియన్స్ ఆటగాళ్లంతా ప్రాక్టీస్ సెషన్ కోసం మైదానంలోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలో ఆటగాళ్లంతా సరదాగా సంభాషించుకుంటున్నారు. అందులో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా కూడా ఉన్నారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ వద్దకు వెళ్లిన హార్దిక్ పాండ్యా అతన్ని కౌగిలించుకున్నాడు. ఇద్దరు కౌగిలించుకుని కాసేపు మాట్లాడుకోవడం వీడియోలో కనిపించింది. ఈ ఘటనతో తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని రోహిత్ శర్మ-హార్దిక్ పాండ్యా స్పష్టం చేసినట్టైంది.


కాగా ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభానికి ముందు అనూహ్యంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పించిన సంగతి తెలిసిందే. ఆ స్థానంలో ట్రేడింగ్ ద్వారా కొనుగోలు చేసిన హార్దిక్ పాండ్యాకు బాధ్యతలు అప్పగించారు. ఈ ఘటన క్రికెట్ వర్గాలను షాక్‌కు గురి చేస్తోంది. ముఖ్యంగా రోహిత్ శర్మ అభిమానులైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోహిత్ శర్మ సతీమణి రితికా తన సోషల్ మీడియా వేదికగా ఈ మార్పుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో రోహిత్ శర్మ- హార్దిక్ పాండ్యా మధ్య విభేదాలు వచ్చాని వార్తలు కూడా వచ్చాయి. కెప్టెన్సీ మార్పు తర్వాత రోహిత్-హార్దిక్ కూడా ఎక్కడా కలుసుకోలేదు. భారత జట్టులో కూడా ఇద్దరు కలిసి ఆడలేదు. రోహిత్ శర్మ టీమిండియాలోనే ఉన్నప్పటికీ, హార్దిక్ పాండ్యా గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉంటున్నాడు. అయితే రోహిత్ శర్మ సోమవారం ముంబై ఇండియన్స్ క్యాంపులో చేరాడు. వచ్చి రాగానే ప్రాక్టీస్ కూడా ప్రారంభించాడు. ఇక ప్రస్తుతం రోహిత్- హార్దిక్ ఒకటైన వీడియో కూడా బయటికి వచ్చింది. దీంతో ముంబై అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇద్దరు కలిసి ఆడి ముంబైకి ఆరో ట్రోఫి అందించాలని కోరుతున్నారు. మొత్తంగా తొలిసారిగా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో రోహిత్ శర్మ ఆడబోతుండడం అనేది ఈ సీజన్‌లో ప్రత్యేకంగా నిలవనుందని చెప్పుకోవాలి. ఇటీవల హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. తన కెప్టెన్సీలో ఆడడానికి రోహిత్ ఇబ్బందిపడడని, అలాగే తనకు కావాల్సిన సమయంలో సహాయం చేస్తాడని చెప్పిన సంగతి తెలిసిందే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 21 , 2024 | 07:49 AM