Share News

IPL 2024: ముంబైకి మరో షాక్.. ఆరంభ మ్యాచ్‌ల‌కు రూ.5 కోట్ల బౌలర్ దూరం

ABN , Publish Date - Mar 18 , 2024 | 04:14 PM

మరో 3 రోజుల్లో ఇండియన ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) 17వ ఎడిషన్ ప్రారంభంకానుంది. దీంతో జట్లన్నీ పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నాయి. అయితే పలువురు ఆటగాళ్లు గాయాలతో దూరం కావడం ఆయా జట్లను కలవరపెడుతోంది. ముఖ్యంగా 5 సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఈ సమస్య కాస్త ఎక్కువ‌గా వేధిస్తోంది.

IPL 2024: ముంబైకి మరో షాక్.. ఆరంభ మ్యాచ్‌ల‌కు రూ.5 కోట్ల బౌలర్ దూరం

మరో 3 రోజుల్లో ఇండియన ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) 17వ ఎడిషన్ ప్రారంభంకానుంది. దీంతో జట్లన్నీ పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నాయి. అయితే పలువురు ఆటగాళ్లు గాయాలతో దూరం కావడం ఆయా జట్లను కలవరపెడుతోంది. ముఖ్యంగా 5 సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఈ సమస్య కాస్త ఎక్కువ‌గా వేధిస్తోంది. ఇప్పటికే ఆ జట్టు పేస్ బౌలర్, శ్రీలంకకు చెందిన దిల్షాన్ మధుశంక గాయం కారణంగా ఆరంభ మ్యాచ్ లకు దూరమయ్యాడు. బంగ్లాదేశ్ తో జరిగిన రెండో వన్డే సందర్భంగా మధుశంక గాయపడ్డాడు. గత వేలంలో మధుశంకను ముంబై రూ.4.6 కోట్లకు కొనుగోలు చేసింది. తాజాగా ఈ జాబితాలో మరో బౌలర్ కూడా చేరాడు. ఆ జట్టు యువ బౌలర్, దక్షిణాఫ్రికా పేసర్ గెరాల్డ్ కోయేట్జీ కూడా ముంబై ఇండియన్స్ ఆడే ఆరంభ మ్యాచ్‌ల‌కు దూరం కానున్నాడని సమాచారం.


గత వేలంలో గెరాల్డ్ కోయేట్జీని ముంబై రూ.5 కోట్లకు కొనుగోలు చేసింది. కాగా గత డిసెంబర్‌లో భారత్‌తో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ తర్వాత గాయం కారణంగా కోయేట్జీ ఆటకు దూరంగా ఉంటున్నాడు. సౌతాఫ్రికా టీ20, సీఎస్ఏ టీ20 లీగ్‌లో కూడా ఆడలేదు. ప్రస్తుతం ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లు కూడా ఆడడని తెలుస్తోంది. అయితే కోయేట్జీ ప్రస్తుతం ముంబై ఇండియన్స్ శిబిరంలోనే ఉన్నాడు. ముంబై వైద్య బృందం సమక్షంలో కోలుకుంటున్నాడు. ఇక ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో ముంబై తమ తొలి మ్యాచ్‌ను ఈ నెల 24న గుజరాత్ టైటాన్స్‌తో ఆడనుంది. గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 18 , 2024 | 04:14 PM