IPL 2024: ముంబై మ్యాచులో ట్విస్ట్.. గుజరాత్ గెలుపునకు వీరే ప్రధాన కారణం
ABN , Publish Date - Mar 25 , 2024 | 07:07 AM
ఐపీఎల్ 2024లో నిన్న అహ్మదాబాద్(ahmedabad)లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ముంబై ఇండియన్స్(mumbai indians), గుజరాత్ టైటాన్స్(Gujarat titans) మధ్య జరిగిన మ్యాచులో ట్విస్ట్ చోటుచేసుకుంది. తక్కువ పరుగుల(169) లక్ష్యంతో బరిలోకి ముంబై జట్టు అనూహ్యంగా ఓటమి పాలైంది. అయితే గుజరాత్ గెలుపునకు ప్రధాన కారణాలేంటో ఇప్పుడు చుద్దాం.
ఐపీఎల్ 2024(ipl 2024)లో నిన్న అహ్మదాబాద్(ahmedabad)లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ముంబై ఇండియన్స్(mumbai indians), గుజరాత్ టైటాన్స్(Gujarat titans) మధ్య జరిగిన మ్యాచులో ట్విస్ట్ చోటుచేసుకుంది. తక్కువ పరుగుల(169) లక్ష్యంతో బరిలోకి ముంబై జట్టు అనూహ్యంగా ఓటమి పాలైంది. ఇక గెలుస్తామనుకున్న మ్యాచులో ఓడిపోగా, గుజరాత్ మంచి ఆరంభంతో విజయం సాధించింది. అయితే ఈ గుజరాత్ గెలుపునకు ప్రధాన కారణాలేంటో ఇప్పుడు చుద్దాం.
ముంబై ఇండియన్స్ విజయానికి చివరి ఓవర్ సమయానికి 19 పరుగులు కావాలి. ఆ క్రమంలో ముంబై కెప్టెన్ హార్దిక్(hardik pandya) ఏడో నంబర్ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఇది ఎవ్వరూ కూడా అంచనా వేయలేదు. వెంటనే రెండు బంతుల్లో ఒక సిక్స్, ఫోర్ కొట్టాడు. దీంతో ముంబై జట్టు అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. కానీ అంతలోనే ఉమేష్(umesh yadav) అతనిని అవుట్ చేసి ముంబై ఓటమిని నిర్ణయించాడు.
ఇక చివరికి 3 బంతుల్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా పీయూష్ చావ్లా క్రీజులోకి వచ్చాడు. భారీ షాట్లు కొట్టే సత్తా ఉన్న పీయూష్ బ్యాట్ నుంచి మంచి షాట్ కొట్టాడు, కానీ అది నేరుగా రషీద్ ఖాన్ చేతుల్లోకి వెళ్లింది. ఉమేష్ రెండు బంతుల్లోనే మ్యాచ్ చిత్రాన్ని తలకిందులు చేశాడు. ఐదో బంతికి బుమ్రా ఒక పరుగు, చివరి బంతికి షమ్స్ ములానీ కూడా ఒక పరుగు చేయడంతో గుజరాత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. మరోవైపు కూడా మోహిత్ శర్మ(Mohit Sharma) కూడా రెండు వికెట్లు పడగొట్టి గుజరాత్ టైటాన్స్ జట్టు విజయానికి కీలక పాత్ర పోషించాడు.
మరోవైపు గుజరాత్ జట్టు గెలుపునకు జట్టు కోచ్ ఆశిష్ నెహ్రా(ashish nehra) కూడా ప్రధాన కారణమని క్రీడా వర్గాలు అంటున్నాయి. ముంబై జట్టు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటిని చిత్తు చేసి గుజరాత్ విజయం సాధించే విధంగా చేశారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో నెహ్రాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
బుమ్రా(bumrah) ముంబై ప్రధాన బౌలర్. కానీ అతనికి మొదటి నుంచి బౌలింగ్ ఇవ్వలేదు. దీంతో గుజరాత్ బ్యాట్స్‌మెన్స్ స్థిరపడ్డారు. బుమ్రాకు బదులుగా పాండ్యా స్వయంగా బౌలింగ్ చేశాడు. కానీ ఒక్క వికెట్ కూడా పడగొట్టలేదు. తర్వాత బుమ్రా 4 ఓవర్లలో 14 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి గుజరాత్ జట్టును కట్టడి చేశాడు. అతను ఆరంభ ఓవర్లలో వచ్చి ఉంటే గుజరాత్ 168 పరుగులకు చేరుకునే అవకాశం ఉండేది కాదు. ఇషాన్ కిషన్(ishan kishan) గత సీజన్‌లో ముంబై తరఫున చాలా పరుగులు చేశాడు. కానీ ఈ సీజన్‌లో అతను మొదటి మ్యాచ్‌లోనే 0 పరుగులకే ఔటయ్యాడు. దీని తర్వాత వచ్చిన నమన్ ధీర్ కూడా 20 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీంతో గుజరాత్ బౌలర్లు మ్యాచుపై పట్టు సాధించారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: MI vs GT : ముంబై.. అదే తీరు!