Home » Mumbai
సిద్ధిఖి హత్య వెనుక గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ చిన్న సోదరుడైన అన్మోల్ ఉన్నట్టు అనుమానిస్తుండగా, అన్మోల్ ప్రస్తుతం కెనడాలో ఉన్నట్టు సమాచారం. ముంబైలోని బాంద్రా ఏరియాలో సిద్దిఖిని అక్టోబర్ 21న ముగ్గురు సాయుధులు కాల్చిచంపారు.
అత్తింటి వారు కోడలిని టీవీ చూడనీయకపోవడం, చాపపై పడుకోమనడం, పొరుగు వారిని కలవనీయకపోవడం వంటివి క్రూరత్వం కిందకు రావని బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ స్పష్టం చేసింది.
దేశచరిత్రలో మహారాష్ట్రకు ప్రత్యేక స్థానం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. దేశ గతిని మార్చిన ఎందరో మహానుభావులకు మహారాష్ట్ర గడ్డ జన్మనిచ్చిందని గుర్తుచేశారు.
సోషల్ మీడియాలో ఓ వీడియోతెగ వైరల్ అవుతోంది. లోకల్ ట్రైన్ ఎక్కిన ఓ వ్యక్తి.. లోపల అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. బోగీ లోపల ప్రయాణికులు కిక్కిరిసి ఉండడంతో అతడికి సీటు దొరకలేదు. అయినా ఆ వ్యక్తి మాత్రం ఎలాంటి కంగారూ పడలేదు. చివరకు..
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తొలగించిన మహారాష్ట్ర డీజీపీ రశ్మి శుక్లా స్థానంలో సంజయ్ కుమార్ వర్మను నూతన డీజీపీగా మంగళవారం నియమించారు.
బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్‌ఖాన్‌కు తాజాగా మరో బెదిరింపు సందేశం వచ్చింది.
ముంబైకి 200 కిలోమీటర్ల దూరంలోని నార్త్ మహారాష్ట్ర టౌన్ అయిన మాలేగావ్‌లో 2008 సెప్టెంబర్ 20న బాంబు పేలుడు ఘటన జరిగింది. మసీదుకు సమీపంలోని మోటార్ వాహనానికి అమర్చిన బాంబు పేలుడు ఘటనలో ఆరుగురు మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు.
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లక్ష్యంగా బెదిరింపు సందేశం రావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. యోగికి మరింత కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ముంబై పోలీసులకు నిన్న సాయంత్రం మెసేజ్ వచ్చింది. ఆ వెంటనే లక్నో పోలీసులను అప్రమత్తం చేశారు. కాల్ చేసింది ఎవరు..? ఎక్కడి నుంచి ఫోన్ చేశారని ఆరా తీస్తున్నారు.
పాప్ మ్యూజిక్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్. పాప్యులర్ అమెరికన్ పాప్ బాండ్ త్వరలో భారత్‌లో పర్యటించనుంది. డిసెంబర్ 3న ముంబైలోని మహాలక్ష్మీ రేసు కోర్సులో ఈ బ్యాండ్ మ్యూజిక్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు.
డిజిటలైజేషన్ దిశగా వేగంగా అడుగులు వేస్తున్న భారత్ సహజంగానే సైబర్ నేరగాళ్లకు అనువైన ప్రాంతంగా మారింది. 2024 సంవత్సరం తొలి నాలుగు నెలల్లోనే రూ.1,750 కోట్లు సైబర్ నేరగాళ్లు దేశ ప్రజల నుంచి కొల్లగొట్టారు.