Share News

Baba Siddique murder: బాబా సిద్ధిఖి హత్యలో కీలక పరిణామం.. షూటర్ శివ అరెస్టు

ABN , Publish Date - Nov 10 , 2024 | 09:06 PM

సిద్ధిఖి హత్య వెనుక గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ చిన్న సోదరుడైన అన్మోల్ ఉన్నట్టు అనుమానిస్తుండగా, అన్మోల్ ప్రస్తుతం కెనడాలో ఉన్నట్టు సమాచారం. ముంబైలోని బాంద్రా ఏరియాలో సిద్దిఖిని అక్టోబర్ 21న ముగ్గురు సాయుధులు కాల్చిచంపారు.

Baba Siddique murder: బాబా సిద్ధిఖి హత్యలో కీలక పరిణామం.. షూటర్ శివ అరెస్టు

ముంబై: సంచలనం సృష్టించిన ఎన్‌సీపీ (NCP) నేత బాబా సిద్ధిఖి (Baba Siddique) హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన షూటర్ శివ (Shooter Shiva) ఉత్తరప్రదేశ్‌లోని బహ్రయిచ్‌ జిల్లా (నేపాల్ సరహద్దు)లో అరెస్టయ్యాడు. ఉత్తరప్రదేశ్ పోలీసులు, ముంబై పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు.

Kishtwar: హోరాహోరీ ఎన్‌కౌంటర్..ఆర్మీ జేసీఓ మృతి, ముగ్గురి జవాన్లకు గాయాలు


ఇంతవరకూ 19 మంది అరెస్టు

సిద్ధిఖి హత్య కేసులో గత గురువారంనాడు పుణె సిటీలోని కార్వేనగర్ నివాసులైన ఆదిత్య గులాంకర్ (22), రఫీఖ్ నియజ్ షేక్ (22)లను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో ఇంతవరకూ అరెస్టయిన వారి సంఖ్య 19కి చేరింది. హత్య కేసు కుట్రదారుల్లో ఒకటైన ప్రవీణ్ లోంకర్, మరో నిందితుడు రూపేష్ మొహోల్‌తో సంప్రదిపులు సాగిస్తుండగా గులాంకర్, షేక్‌లను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. లోంకర్, మొహోల్‌ ఇప్పటికే అరెస్టయ్యారు. ఈ ఇద్దరే గులాంకర్, షేక్‌లకు 9 ఎంఎం పిస్తోలు, అమ్యూనిషన్‌ అందజేశారని, హత్యానేరంలో వీటిని వాడారని చెప్పారు. పిస్తోల్‌ను ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


సిద్ధిఖి హత్య వెనుక గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ చిన్న సోదరుడైన అన్మోల్ ఉన్నట్టు అనుమానిస్తుండగా, అన్మోల్ ప్రస్తుతం కెనడాలో ఉన్నట్టు సమాచారం. ముంబైలోని బాంద్రా ఏరియాలో సిద్దిఖిని అక్టోబర్ 21న ముగ్గురు సాయుధులు కాల్చిచంపారు. ఈ హత్య తీవ్ర సంచలనం సృష్టించగా, హత్య వెనుక కారణం ఏమిటనేది ఇంకా నిర్ధారణ కాలేదు.


ప్రముఖ నటుడు కన్నుమూత.. సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం

సారీ నాన్నా అమ్మను చంపేశా

యడియూరప్ప, శ్రీరాములుపై న్యాయ విచారణ!

For More National And Telugu News

Updated Date - Nov 10 , 2024 | 09:06 PM