Share News

CM Revanth Reddy: మోదీ అబద్ధాలు చెప్పడం మానాలి.. సీఎం రేవంత్ వార్నింగ్

ABN , Publish Date - Nov 09 , 2024 | 01:04 PM

దేశచరిత్రలో మహారాష్ట్రకు ప్రత్యేక స్థానం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. దేశ గతిని మార్చిన ఎందరో మహానుభావులకు మహారాష్ట్ర గడ్డ జన్మనిచ్చిందని గుర్తుచేశారు.

CM Revanth Reddy: మోదీ అబద్ధాలు చెప్పడం మానాలి.. సీఎం రేవంత్ వార్నింగ్

ముంబై: మహారాష్ట్ర బీజేపీ నేతలు కొద్దిరోజులుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా తెలంగాణలో కాంగ్రెస్ గ్యారంటీల అమలుపై అబద్దాలు చెప్పడం మొదలుపెట్టారని అన్నారు. ఇవాళ(శనివారం) ముంబైలో రేవంత్‌రెడ్డి పర్యటించారు. ముంబైలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ... మోదీ అబద్ధాలు చెప్పడం మానుకోకపోతే.. తాము నిజాలు చెబుతూనే ఉంటామని అన్నారు. అందుకే నేను మహారాష్ట్ర ప్రజలకు తెలంగాణలో ఆరు గ్యారంటీల అమలుపై నిజాలు చెప్పడానికి ఇక్కడకు వచ్చానని స్పష్టం చేశారు. దేశంలో మహారాష్ట్రలోనే ఎక్కువ రైతు ఆత్మహత్యలు జరిగాయని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని మరిచాయని ఆరోపించారు. నల్లచట్టాలు తెచ్చి అదానీ, అంబానీలకు మేలు చేయాలని మోదీ భావించారన్నారు. తెలంగాణలో రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చామని... ఇచ్చిన మాట ప్రకారం 25 రోజుల్లో 22,22,067 మంది రైతులకు రూ.17,869 కోట్లు మాఫీ చేశామని తెలిపారు. ఎవరికైనా వివరాలు కావాలంటే ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. తెలంగాణ రైతుల విషయంలో మోదీ విమర్శలకు సరైన సమాధానం ఇచ్చామన్నారు. ఆ తర్వాత ఆయన తన ట్వీట్‌ను డిలీట్ చేసుకున్నారని చెప్పారు.


దేశచరిత్రలో మహారాష్ట్రకు ప్రత్యేక స్థానం...

‘‘ప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లోనే 50వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. మహాలక్ష్మీ పథకం ద్వారా రూ.500లకే గ్యాస్ అందిస్తున్నాం. ఇప్పటివరకు దాదాపు 50 లక్షల మంది 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ద్వారా లబ్ధి పొందుతున్నారు. వరికి రూ.500 మద్దతు ధర అందిస్తున్నాం. కోటి 4 లక్షల మంది మహిళలు ఈ పది నెలల్లో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వినియోగించుకున్నారు. ఇందుకోసం రూ.3541 కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం అందించింది. సామాజిక న్యాయం అందించేందుకు తెలంగాణలో కులగణన చేపట్టాం. 2025 జనగణలో తెలంగాణ కులగణనను పరిగణనలోకి తీసుకోవాలని కేబినెట్‌లో తీర్మానం చేసి.. మోదీని డిమాండ్ చేశాం. దేశచరిత్రలో మహారాష్ట్రకు ప్రత్యేక స్థానం ఉంది. దేశ గతిని మార్చిన ఎందరో మహానుభావులకు మహారాష్ట్ర గడ్డ జన్మనిచ్చింది. మహాత్మా జ్యోతిబాపూలే, బాలగాంగధర్ తిలక్, సావిత్రిబాయి పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి ఎందరో మహానుభావులు ప్రజల్లో చైతన్యం నింపి దేశానికి ఒక దారి చూపారు. ఇంతటి ఘనత ఉన్న మహారాష్ట్ర ఎవరి చేతుల్లోకో వెళ్లకూడదు. మహారాష్ట్రకు రావాల్సిన 17 మెగా ప్రాజెక్టులు మోదీ గుజరాత్‌కు తరలించుకొని పోయారు. మిమ్మల్ని మోసం చేసిన బీజేపీని ఈ ఎన్నికల్లో ఓడించాలి’’ అని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి

Hyderabad: ఈఎస్‌ఐ మెట్రో స్టేషన్‌ వద్ద అనుకోని ఘటన.. భయంతో జనం పరుగులు

Minister Narayana: జగన్ ప్రభుత్వ అవినీతిపై విచారణ.. మంత్రి నారాయణ వార్నింగ్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 09 , 2024 | 01:36 PM