Home » Munugode News
మునుగోడు: ఉత్కంఠభరితంగా సాగిన మునుగోడు ఉప ఎన్నికలో విజేతగా ఎవరు నిలవబోతున్నారో ఎన్నికల సర్వే సంస్థలు అంచనా వేశాయి....
munugode election : రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తున్న మునుగోడు ఉప ఎన్నిక రానే వచ్చింది. ఇన్నాళ్లూ ఓటరు దేవుళ్లను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు రకరకాల ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. ఓ వైపు పోటాపోటీ ప్రచారం చేయడంతో పాటూ మరోవైపు ఓటర్లను డబ్బు, మద్యం పంపిణీ తదితర మార్గాల ద్వారా..
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ముగ్గురు నిందితులకు రిమాండ్ విధించడానికి నిరాకరిస్తూ, పోలీసుల రిమాండ్ రిపోర్ట్‌ను హైదరాబాద్ ఏసీబీ కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో.. ఆ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు నేడు కీలక ఆదేశాలు జారీ చేసింది.
దేశంలోనే అత్యధిక ఖరీదైన ఎన్నికగా మునుగోడు ఉప ఎన్నిక (Munugode By Election) ఉండబోతుందని సర్వత్రా విస్తృత ప్రచారం జరిగింది. ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలు సుమారు రూ.300 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం.
మునుగోడు ఉప ఎన్నిక (Munugode by-election) ప్రతిష్ఠాత్మకంగా మారడంతో ప్రధాన పార్టీలు సవాల్‌గా తీసుకున్నాయి. పోలింగ్ బూత్ స్థాయిలో కీలక నేతలకు బాధ్యతలు అప్పగించారు.
మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలను ఓడించి గుణపాఠం చెప్పాలని సీఎల్పీ మాజీ నేత కందూరు జానారెడ్డి అన్నారు.
మునుగోడు నియోజకవర్గ ఓటర్లకు పండుగే పండుగ. ఇక దీపావళి పండుగకు ఓటర్లు ఏది అడిగితే అదే అన్న విధంగా ఆయా రాజకీయ పార్టీలు పంపిణీ చేస్తున్నాయి. ఇప్పటికే నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో మద్యం ఏరులై పారుతుండగా ఆత్మీయ సమ్మేళనాల పేరిట దావత్‌లు కూడా కొనసాగుతున్నాయి.
నల్లగొండ: టీఆర్ఎస్ (TRS) మునిగిపోయే నావా అని... అందులోకి తానెందుకు వెళ్తానని బీజేపీ ఎమ్మెల్యే (BJP MLA) రఘునందన్ రావు అన్నారు. శనివారం ఏబీఎన్‌తో మాట్లాడుతూ... నిన్న టీఆర్ఎస్‌లోకి వెళ్ళిన వాళ్ల రిజైన్ లెటర్స్ ప్రగతి భవన్‌లోనే టైప్ అయ్యాయన్నారు. ‘‘టీఆర్ఎస్ పార్టీ కుండకు రంద్రం కొట్టిందే నేను. నేను వెలమ కాబట్టే నాపై బురద చల్లుతున్నారు.
స్వార్ధరాజకీయాల వల్లే మునుగోడు ఉపఎన్నిక వచ్చిందని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. మరోసారి కుట్రలు చేసి కేంద్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ యత్నించిందన్నారు.
మునుగోడు నియోజకవర్గంలోని మొత్తం ఓట్లు 2,27,265 కాగా.. ఓటర్లలో 10 నుంచి 15 శాతం మంది ఇతర ప్రాంతాల్లోనే ఉంటున్నారు. వీరిలో హైదరాబాద్‌లోనే 25 వేల మందికి పైగా ఉన్నట్లు సమాచారం.