Home » Munugode
Hyderabad: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) కేసీఆర్ (KCR) సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్ (TRS) ప్రభుత్వం మునుగోడు (Munugodu) నియోజక వర్గ ప్రజలకు డబ్బు, మద్యం, బిర్యానీ పెట్టి ఓట్లు వేయించుకోవాలని చూస్తోందని, అయితే వాటిల్లో దేనికీ ప్రజలు అమ్ముడుపోరని పేర్కొన్నారు.
మునుగోడు ఉప ఎన్నిక (Munugode by-election) ప్రతిష్ఠాత్మకంగా మారడంతో ప్రధాన పార్టీలు సవాల్‌గా తీసుకున్నాయి. పోలింగ్ బూత్ స్థాయిలో కీలక నేతలకు బాధ్యతలు అప్పగించారు.
నా ప్రచారాన్ని అడ్డుకునే దమ్ముందారా.. తొక్కుత నా కొడుకుల్లారా’ అంటూ మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్, టీఆర్‌ఎస్, సీపీఎం కార్యకర్తలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలను ఓడించి గుణపాఠం చెప్పాలని సీఎల్పీ మాజీ నేత కందూరు జానారెడ్డి అన్నారు.
మునుగోడు నియోజకవర్గ ఓటర్లకు పండుగే పండుగ. ఇక దీపావళి పండుగకు ఓటర్లు ఏది అడిగితే అదే అన్న విధంగా ఆయా రాజకీయ పార్టీలు పంపిణీ చేస్తున్నాయి. ఇప్పటికే నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో మద్యం ఏరులై పారుతుండగా ఆత్మీయ సమ్మేళనాల పేరిట దావత్‌లు కూడా కొనసాగుతున్నాయి.
యాదాద్రి, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): మునుగోడు ఆత్మగౌరవాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గుజరాత్ గద్దల వద్ద రూ.18 వేల కోట్లకు తాకట్టు పెట్టారని టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆరోపించారు. గత ఎన్నికల్లో పొరపాటున గెలిచిన రాజగోపాల్‌రెడ్డి అప్పటినుంచి బీజేపీ జపమే చేస్తున్నారని అన్నారు.
మునుగోడు ఉప ఎన్నికల (Munugodu by poll) కోసం టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. మునుగోడులో గెలుపు తమదే అన్న ధీమాలో ఇరు పార్టీలు ముందుకెళ్తున్నాయి.
‘‘తెలంగాణ యువత, ప్రజల భవిష్యత్ మీ చేతుల్లోనే ఉంది.. వాళ్లను సాదుకుంటారా..? సంపుకుంటారా..? ఆలోచించాలి’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మునుగోడు నియోజకవర్గ ప్రజలను కోరారు. మునుగోడు ఉప ఎన్నిక స్థానికుల కోసం కాదని తెలంగాణ ప్రజల భవిష్యత్ కోసం వచ్చిన ఎన్నిక అని తెలిపారు.
నల్లగొండ: టీఆర్ఎస్ (TRS) మునిగిపోయే నావా అని... అందులోకి తానెందుకు వెళ్తానని బీజేపీ ఎమ్మెల్యే (BJP MLA) రఘునందన్ రావు అన్నారు. శనివారం ఏబీఎన్‌తో మాట్లాడుతూ... నిన్న టీఆర్ఎస్‌లోకి వెళ్ళిన వాళ్ల రిజైన్ లెటర్స్ ప్రగతి భవన్‌లోనే టైప్ అయ్యాయన్నారు. ‘‘టీఆర్ఎస్ పార్టీ కుండకు రంద్రం కొట్టిందే నేను. నేను వెలమ కాబట్టే నాపై బురద చల్లుతున్నారు.
స్వార్ధరాజకీయాల వల్లే మునుగోడు ఉపఎన్నిక వచ్చిందని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. మరోసారి కుట్రలు చేసి కేంద్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ యత్నించిందన్నారు.