Home » Nandamuri Balakrishna
ఏపీ అసెంబ్లీలో టీడీపీ నేతల ఆందోళన కొనసాగుతోంది. సైకో పాలన పోవాలి అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ విజిల్స్ వేస్తూ నిరసన తెలిపారు. దీనిపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీ అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబుపై మోపిన స్కిల్ అక్రమ కేసు పెద్ద ఎత్తున దుమారం రేపింది. స్పీకర్ పోడియంను టీడీపీ ఎమ్మెల్యేలు చుట్టుముట్టారు. ఈ క్రమంలోనే వైసీపీ ఎమ్మెల్యేలు పోడియం వద్దకు వెళ్ళబోయారు.
రాజమండ్రి జైల్లో ములాఖత్ ద్వారా చంద్రబాబును పవన్‌కల్యాణ్, బాలకృష్ణ, లోకేష్ (Nara Lokesh) కలిశారు. దాదాపు 40 నిమిషాల పాటు చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలు, స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించిన అంశాలపై చర్చకు వచ్చినట్లు తెలిసింది.
రేపు తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu)ను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, హిందూపుర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, నారాలోకేష్ కలవనున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో కొందరు ప్రాణాలు కొల్పోయారని... ఆ కుటుంబాలను పరామర్శిస్తానని హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. టీడీపీ కార్యకర్తలు ఎవ్వరికీ భయపడనక్కర్లేదన్నారు.
టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆవేదనభరిత దృశ్యం ఆవిష్కృతమైంది. సోమవారం నాడు పార్టీ కేంద్ర కార్యాలయానికి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) వచ్చారు.
చంద్రబాబు అరెస్ట్(Chandrababu Arrested)కు నిరసనగా ఏపీలో టీడీపీ బంద్‌కు పిలుపునిచ్చింది. భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై నేతలతో హిందూపురం ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) సమాలోచనలు చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్రంగా ఖండించారు. జగన్ పాలకుడు కాదు కక్ష్యదారుడని విరుచుకుపడ్డారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ దుర్మార్గమన్నారు. జగన్ సీఎం అయ్యాక అన్నం తినటం మానేసి కోర్టుల చేత చివాట్లు తింటున్నారని యెద్దేవా చేశారు.
అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రానికి చెందిన 11 తరగతి చదువుతున్న ప్రవాస తెలుగు హై స్కూల్ విద్యార్థిని హాసిని పాపరాజు.. https://www.understem.org/ అనే స్వచ్ఛంద సంస్థని నెలకొల్పింది.
హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా మహిళా నాయకురాలు టిఎన్ దీపికను వైసీపీ అధిష్ఠానం నియమించింది. ఈ నియామకం వెనుక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చక్రం తిప్పినట్లు సమాచారం. రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి ముచ్చటగా మూడోసారి నందమూరి బాలకృష్ణ, వైసీపీ నుంచి దీపిక తలపడటం దాదాపుగా ఖాయమైంది.