NTR Death Anniversary:ఎన్టీఆర్ సాహసోపేతమైన పథకాలను అమలు చేశారు: నందమూరి బాలకృష్ణ
ABN , Publish Date - Jan 18 , 2025 | 09:17 AM
NTR Death Anniversary:ఎన్టీఆర్ ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులు అర్పించారు. తెలుగుజాతి ఉన్నంతవరకు ఎన్టీఆర్‌ను మరచిపోలేరని బాలకృష్ణ ఉద్ఘాటించారు.

హైదరాబాద్: తెలుగుదేశం వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 29వ వర్థంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఆయన కుమారులు నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ, మనుమరాలు నందమూరి సుహాసిని, తదితర కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడారు. నటుడిగా, నాయకుడిగా ఎన్టీఆర్ తనకు తానే సాటి అని చెప్పారు. పేదల కోసం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని గుర్తుచేశారు. ఎన్టీఆర్‌తోనే తెలుగువారిలో రాజకీయ చైతన్యం వచ్చిందని అన్నారు. టీడీపీ కంటే ముందు రాజకీయాల మీద నాన్నకు ఆసక్తి ఉండేది కాదని తెలిపారు. ఎన్టీఆర్ సాహసోపేతమైన పథకాలను అమలు చేశారని ఉద్ఘాటించారు. ఎన్టీఆర్ ముందు.. ఆ తర్వాత అనే విధంగా తెలుగు రాజకీయాలు ఉన్నాయని నందమూరి బాలకృష్ణ అన్నారు.
ప్రజల వద్దకు పాలన తీసుకురావటానికి ఎన్టీఆర్ ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని చెప్పారు. ఇప్పటికీ ఎన్టీఆర్ పథకాలనే ప్రస్తుత ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయన్నారు. ఎన్టీఆర్ అంటే ఒక వర్సిటీ.. తెలుగుజాతికి మార్గదర్శకమని అని చెప్పారు. ఎన్టీఆర్ అంటే నటనకు నిర్వచనం.. నవరసాలకు అలంకారమని తెలిపారు. పేదలకు ఉపయోగపడే పథకాలను ఎన్టీఆర్ ప్రవేశపెట్టారని ఉద్ఘాటించారు. కష్టజీవుల కన్నీళ్లు, అన్నార్తుల ఆకలి నుంచి టీడీపీ పుట్టిందని బాలకృష్ణ ఉద్ఘాటించారు.వివిధ వర్గాల వారికి ఎన్టీఆర్ ధైవసమానమని అన్నారు. కార్యకర్తలను నాయకులుగా తయారుచేసింది ఎన్టీఆర్ మాత్రమే అని చెప్పారు. మద్రాసు నగరానికి మంచి నీళ్లు ఇచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్ అని నందమూరి బాలకృష్ణ కొనియడారు.
ఈ వార్తలు కూడా చదవండి
Chandrababu's Achievements : జగన్ మాటలు.. బాబు చేతలు!
NTR Death Anniversary: తెలుగుదనానికి ప్రతిరూపం ఎన్టీఆర్ : మంత్రి నారా లోకేష్
Read Latest AP News and Telugu News