బాలయ్య, పవన్‌తో సినిమా తీయడానికి రెడీ.. కామెడీ పండించిన ఎమ్మెల్యేలు
ABN, Publish Date - Mar 20 , 2025 | 08:36 PM
విజయవాడ ఏ కన్వెన్షన్‌లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలను స్వయంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రదర్శించారు.
అమరావతి: విజయవాడ ఏ కన్వెన్షన్‌లో గురువారం నాడు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలను స్వయంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రదర్శించారు. ఇదీ సంగతి అంటూ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, జూలకంటి బ్రహ్మానంద రెడ్డి, కూన రవికుమార్, పాశం సునీల్, అరవిందబాబు, వర్ల కుమార్ రాజా హాస్య నాటకం ప్రదర్శించారు. సీఎం చంద్రబాబు జనాభా పెరుగుదలపై చేస్తున్న ప్రకటనలపై కామెడీ స్కిట్‌ను నేతలు ప్రదర్శించారు.
సబ్జెక్ట్‌లు పాస్ కాకపోయినా తెలుగుదేశం నేతలకు చెందిన నారాయణ, భాష్యం, విజ్ఞాన్, ఎన్నారై కళాశాలల్లో సీటు ఇప్పించాలంటూ అమాయక పాత్రలో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి ఆకట్టుకున్నారు. పాస్ కాని విద్యార్థికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఎందుకు సీటు ఇప్పించలేదని ఎమ్మెల్యే జూలకంటి హాస్యం పండించారు పాస్ కాకపోతే ఏ ఎమ్మెల్యే అయినా సీటు ఇప్పించలేడు అంటూ కార్యకర్త కోరిక తీర్చలేక సహనం పాటించే పాత్రలో జీవీ ఆంజనేయులు ఆకట్టుకున్నారు. పది పాస్ కాని విద్యార్థికి ఎస్పీ ఉద్యోగం, బాలయ్య బాబు, పవన్ కల్యాణ్‌తో సినిమా డైరెక్షన్ ఇప్పించాలంటూ కార్యకర్తల పాత్రాలను కూన రవి, అరవింద బాబు పోషించారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Mar 20 , 2025 | 08:56 PM