Home » Nara Chandrababu Naidu
ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంటు మార్పు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణను నవంబర్ 7కు ఏపీ హైకోర్టు వాయిదా వేసింది.
మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారంలో బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరితో పాటు తాము స్పందించడం జరిగిందని ఏపీ బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ తీరు సరికాదన్నారు.
విజయవాడ (గొల్లపూడి)లో దేవినేని ఉమ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. రైతాంగ సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకువెళ్తానన్న దేవినేని ఉమను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఆయనను బయటకు వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి మరోసారి వివాదాస్పదమైన సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ఆయన మృతికి కారకులైన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని అన్నారు. చంద్రబాబు నాయుడిని చంపేసి లోకేష్‌ను ముఖ్యమంత్రి చేయాలని చూస్తున్న కుటుంబం నారావారిది అంటూ వ్యాఖ్యలు చేశారు.
మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అడ్డుకోవడంపై టీడీపీ చీఫ్ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫైబర్ నెట్ కేసులో ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు మెమో దాఖలు చేశారు. పీటీ వారెంట్‌పై రేపు టీడీపీ అధినేత చంద్రబాబును ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టాల్సి ఉండటంతో సీఐడీ అధికారులు మెమో దాఖలు చేశారు.
తీర్పు ఎప్పుడు రావొచ్చు..? సుప్రీంలో ఇవాళ జరిగిన వాదనలు చంద్రబాబుకు ఊరటనిస్తాయా..? ప్రభుత్వ న్యాయవాది ఎందుకు వాదనలను సాగదీశారు..? తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు ఎప్పుడు ఉత్తర్వులిస్తుంది..?..
రాజమండ్రి సెంట్రల్ జైలులో టీడీపీ అధినేత చంద్రబాబు లీగల్ ములాఖత్‌లకు అధికారులు కోత విధించారు. రోజుకు రెండు లీగల్ ములాఖత్‌లను ఒకటికి కుదించారు. చంద్రబాబు ములాఖత్‌ల వల్ల సాధారణ ఖైదీలకు జైలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ అధికారులు వింత సాకులు చెపుతున్నారు. పరిపాలనా కారణాలతో ఇకపై రెండో ములాఖత్ రద్దు చేసినట్లు జైలు అధికారులు లిఖిత పూర్వకంగా తెలిపారు.
టీడీపీ అధినేత చంద్రబాబును చంపితే తమకేం వస్తుందని.. ఆయన ఎక్కడ ఉన్నా ఒక్కటే అని ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతుగా రాజమండ్రిలో ఉన్న నారా భువనేశ్వరిని కలిసేందుకు టీడీపీ శ్రేణులు సంఘీభావ యాత్రకు పూనుకున్నారు. అయితే ఈ కార్యక్రమానికి అనుమతిలేదంటూ.. భువనేశ్వరిని కలిసేందుకు వెళితే చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు నోటీసులు ఇవ్వడంపై చంద్రబాబు సతీమణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.