Home » Nara Chandrababu Naidu
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. శుక్రవారం స్కిల్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్పై సుప్రీంలో విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం ముందు విచారణకు రాగా.. తదుపరి విచారణను వచ్చే మంగళవారం(అక్టోబర్17) మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది.
టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంతో జగన్ రెడ్డి చెలగాటమాడుతున్నారని ఎమ్మెల్యే బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజమండ్రి సెంట్రల్ జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై టీడీపీ నేతలు చేస్తున్న ఆందోళనలపై ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తప్పు చేయకపోతే నిలదీయాలి గానీ ఇలా చేయడం దారుణమని.. జైలు అత్తగారిల్లా ఏసీ పెట్టడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును పట్టకున్న పోలీసులు, జైలు వాతావరణం, ఖైదీలు, డాక్టర్ల మీద, ప్రభుత్వం మీద, సీఎం మీద ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
రాజమండ్రి జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై కుట్రలు జరుగుతున్నాయని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ ఆరోపించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితిపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని వెల్లడి చేయకుండా ప్రభుత్వ వైద్యులపై పోలీసులు ఒత్తిడి పెట్టారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.
జైల్లో తన భర్తకు అత్యవసరంగా అవసరమైన వైద్యాన్ని సకాలంలో అందించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమైందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పేర్కొన్నారు.
మద్యపానం నిషేధం అమలుపై డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి ఆవేశభరితమైన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం వస్తే మద్యపానం నిషేధం చేస్తామని ప్రకటించమనాలంటూ.. రాబోయే ప్రభుత్వం చంద్రబాబుదే అంటూ ఉప ముఖ్యమంత్రి నర్మగర్భంగా ఒప్పుకున్నారు.
అప్పట్లో ఎన్టీఆర్పై అభియోగాలు వచ్చినా లెజిస్లేటివ్ కమిటీ మూడేళ్ల పాటు విచారణ జరిపించిందని.. అభియోగాలపై ఎన్టీఆర్ను అప్పట్లో జైలులో పెట్టలేదని మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు.
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు ఇటీవల రాజమండ్రి సెంట్రల్ జైలులో అస్వస్థతకు లోనైన సంగతి తెలిసిందే..అయితే.. గురువారం కూడా మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో హుటాహుటిన వైద్యులు జైల్లో పరీక్షలు నిర్వహించారు.
కేంద్ర హోమంత్రి అమిత్ షా (Amit Shah)తో భేటీలో జరిగిన కీలక విషయాలను మీడియాతో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) పంచుకున్నారు.