Share News

Narayanaswamy: డిప్యూటీ సీఎం ఆవేశభరిత వ్యాఖ్యలు.. వచ్చేది చంద్రబాబు ప్రభుత్వమే అని ఒప్పుకున్నట్టేనా?

ABN , First Publish Date - 2023-10-13T11:29:12+05:30 IST

మద్యపానం నిషేధం అమలుపై డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి ఆవేశభరితమైన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం వస్తే మద్యపానం నిషేధం చేస్తామని ప్రకటించమనాలంటూ.. రాబోయే ప్రభుత్వం చంద్రబాబుదే అంటూ ఉప ముఖ్యమంత్రి నర్మగర్భంగా ఒప్పుకున్నారు.

Narayanaswamy: డిప్యూటీ సీఎం ఆవేశభరిత వ్యాఖ్యలు.. వచ్చేది చంద్రబాబు ప్రభుత్వమే అని ఒప్పుకున్నట్టేనా?

చిత్తూరు: మద్యపానం నిషేధం అమలుపై డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి (Deputy CM, Excise Minister Narayanaswamy) ఆవేశభరితమైన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం (Chandrababu Government) వస్తే మద్యపానం నిషేధం చేస్తామని ప్రకటించమనాలంటూ.. రాబోయే ప్రభుత్వం చంద్రబాబుదే (TDP Chief Chandrababu Naidu) అంటూ ఉప ముఖ్యమంత్రి నర్మగర్భంగా ఒప్పుకున్నారు. మద్యం పాలసీలపై బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి (AP BJP Chief Purandeshwari) కోరిన సీబీఐ (CBI) విచారణను స్వాగతిస్తున్నామన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో మద్యం పాలసీలపైన కూడా సీబీఐ విచారణ వేయాలన్నారు. చంద్రబాబు పాలనలోనే ఎక్కువగా ఎక్సెస్ శాఖకు సంబంధించి పీడీ యాక్టుల్ నమోదయ్యాయన్నారు. తను వెళ్లే మార్గంలో రూట్ క్లియరెన్స్ ఇవ్వండంలో పోలీసుల తీరుపై మంత్రి నారాయణస్వామి అసహనం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-10-13T11:29:12+05:30 IST