Nara Lokesh: ఆ కేసులపై అమిత్ షా ఆరా తీశారు

ABN , First Publish Date - 2023-10-12T17:29:15+05:30 IST

కేంద్ర హోమంత్రి అమిత్ షా (Amit Shah)తో భేటీలో జరిగిన కీలక విషయాలను మీడియాతో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) పంచుకున్నారు.

 Nara Lokesh: ఆ కేసులపై అమిత్ షా ఆరా తీశారు

ఢిల్లీ: కేంద్ర హోమంత్రి అమిత్ షా (Amit Shah)తో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) బుధవారం నాడు ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత నారా లోకేష్ ఢిల్లీ వేదికగా మీడియాకు పలు కీలక విషయాలను తెలిపారు. ‘‘రెండు రోజుల క్రితం ఇన్నర్‌ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ విచారణకు హాజరయ్యాను. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేశారు. హోంమంత్రి అమిత్ షా తన వద్దకు రమ్మన్నారని చెప్పారు. నేను నిన్న రాత్రి అమిత్‌ షా దగ్గరికి వెళ్లాను. చంద్రబాబుపై, నాపై వైసీపీ ప్రభుత్వం పెట్టిన కేసుల గురించి అమిత్ షా వివరాలు అడిగి తెలుసుకున్నారు. అమిత్ షా దగ్గర చంద్రబాబు నాయుడు భద్రత అంశంపై ఆందోళనా వ్యక్తం చేశాను. అమిత్ షా కూడా కేసుల గురించి ఆరా తీశారు. 73 ఏళ్ల వయస్సు ఉన్న చంద్రబాబును జైల్లో పెట్టడంపై అమిత్ షా ఆరా తీశారు’’ అని నారా లోకేష్ తెలిపారు.

వైసీపీ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోంది

‘‘చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు డీ హైడ్రేషన్‌కి గురి అయ్యారని షా కు వివరించాను. జైల్లో మాజీ నక్సల్స్ ఉన్నారనే విషయాన్ని అమిత్ షా దృష్టికి తీసెకెళ్లాను. అన్ని కేసులు గురించి అమిత్ షా కు చెప్పాము. అమిత్ షా తో ఎలాంటి రాజకీయ అంశాలపై చర్చించ లేదు. ఎన్ని కేసులు , ఏ ఏ బెంచ్‌లో ఉన్నాయనే అంశాలను అమిత్ షా అడిగారు. ఓ మంత్రి సమక్షంలో ఒక వైసీపీ ఎంపీ బీజేపీయే చంద్రబాబు అక్రమ అరెస్ట్ వెనుక ఉందని చెప్పారు. జగన్ కూడా నేను విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు చంద్రబాబును అరెస్ట్ జరిగిందని చెప్పారు. బాబు అరెస్ట్ వెనుక బీజేపీ హస్తం ఉందని వైసీపీ పార్టీ ప్రచారం చేసుకుంటుంది. టీడీపీ, బీజేపీ మీటింగ్ ఆసక్తికరంగా ఉండోచ్చు’’ అని నారా లోకేష్ పేర్కొన్నారు.

Updated Date - 2023-10-12T18:16:10+05:30 IST